త్వరలో విద్యావాలెంటీర్ల నియామకం | Vidya Volunteers Recruitment very soon, says kadiyam srihari | Sakshi
Sakshi News home page

త్వరలో విద్యావాలెంటీర్ల నియామకం

Published Tue, Jul 19 2016 7:09 PM | Last Updated on Sun, Sep 2 2018 5:24 PM

త్వరలో విద్యావాలెంటీర్ల నియామకం - Sakshi

త్వరలో విద్యావాలెంటీర్ల నియామకం

హైదరాబాద్ : రాష్ట్రంలో ప్రజాప్రతినిధుల వద్ద 41మంది ఉపాధ్యాయులు పీఏ, పీఎఫ్లుగా ఉన్నారని మంత్రి కడియం శ్రీహరి తెలిపారు. ఆయన మంగళవారమిక్కడ మీడియాతో మాట్లాడుతూ టీచర్లు ప్రజాప్రతినిధుల వద్ల పని చేయకూడదన్న సుప్రీంకోర్టు ఉత్తర్వులను అమలు చేస్తామన్నారు. ఈ నెలాఖరుకల్లా అన్ని యూనివర్సిటీలకు వైస్ చాన్సులర్ల నియామకం పూర్తవుతుందని కడియం తెలిపారు.

తనకున్న సమాచారం ప్రకారం ఎంసెట్ పేపర్ లీక్ అయిందన్న వార్తలు వాస్తవం కాదని ఆయన అన్నారు. ప్రయివేట్ స్కూళ్లలో ఫీజుల నియంత్రణకు కట్టుబడి ఉన్నామని, ఇప్పటికే ఆయా పాఠశాలలకు నోటీసులు ఇచ్చామన్నారు. కోర్టు ఉత్తర్వుల బట్టి చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. విద్యా వాలెంటీర్ల నియామకం వీలైనంత త్వరలో పూర్తి చేస్తామని కడియం శ్రీహరి పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement