వేములవాడ రూరల్: కరీంనగర్ జిల్లాలోని ఇసుక క్వారీలపై విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. ఇసుకను అక్రమంగా తరలిస్తున్న ఐదు లారీలను అధికారులు సీజ్ చేశారు. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం అగ్రహారం గుట్టల నుంచి ఇసుకను తరలిస్తుండగా సమాచారం అందుకున్న నిఘా విభాగం అధికారి సుధాకర్‌రెడ్డి సిబ్బందితో కలసి దాడి చేసి వాటిని పట్టుకున్నారు. వాటిని స్టేషన్‌కు తరలించారు.