పుర ప్రణాళిక.. రూ.1646 కోట్లు | Village planning in Nilgiri | Sakshi
Sakshi News home page

పుర ప్రణాళిక.. రూ.1646 కోట్లు

Published Mon, Sep 1 2014 2:55 AM | Last Updated on Fri, Nov 9 2018 5:52 PM

పుర ప్రణాళిక.. రూ.1646 కోట్లు - Sakshi

పుర ప్రణాళిక.. రూ.1646 కోట్లు

 పల్లె ప్రణాళిక తరహాలోనే పట్టణ ప్రణాళికలు సిద్ధమయ్యాయి. జిల్లాలో మొత్తం ఐదు మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీల్లో నిర్దేశించిన పనులకు రూ.1646 కోట్ల 33 లక్షలు కావాలని లెక్క తేల్చారు. ప్రభుత్వ మార్గదర్శకాల మేరకు ఒక్కో వార్డులో కనీసం మూడు పనులకు తగ్గకుండా గుర్తించారు. అదే విధంగా మున్సిపాలిటీ మొత్తానికి   పనికొచ్చే విధంగా 10 నుంచి 15 పనులను    అధికారులు గుర్తించారు.
 
 నీలగిరి : రాష్ర్ట ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన పల్లె ప్రణాళిక, మండల, జిల్లా ప్రణాళిక మాదిరిగానే మున్సిపాలిటీల్లో ‘మన వార్డు-మన ప్రణాళిక’ సిద్ధం చేశారు. ఈ కార్యక్రమంలో భాగంగా అధికారులు వార్డుల వారీగా సభలు నిర్వహించి ప్రజా సమస్యలు గుర్తించారు. దీంట్లో ప్రజలు, ప్రజాప్రతినిధుల భాగస్వామ్యంతో వార్డు సభల్లో వచ్చిన విజ్ఞప్తుల ఆధారంగా ఈ ప్రణాళిక రూపొందించారు. నల్లగొండ, భువనగిరి, సూర్యాపేట, కోదాడ, మిర్యాలగూడ మున్సిపాలిటీలకు రూ.1499.51 కోట్లు, హుజూర్‌నగర్, దేవరకొండ నగర పంచాయతీలకు రూ.146.82 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. వ్యక్తిగత అర్జీలను పక్కన పెట్టి..సామాజిక అవసరాల మేర గుర్తించిన పనులను ప్రాధాన్యత క్రమంలో పరిగణనలోకి తీసుకున్నారు.
 
 అత్యధికంగా వార్డుల్లో సీసీ రోడ్లు, తాగునీరు, పైప్‌లైన్లు, డ్రెయినేజీలకు సంబంధించిన అర్జీలు వెల్లువెత్తాయి. వీటితోపాటు పట్టణ ప్రజల మౌలిక సదుపాయాలకు పెద్దపీట వేశారు. తాగునీటి సరఫరా, రోడ్లు, వీధిదీపాలు, డ్రెయినేజీలకు తొలి ప్రాధాన్యతనిచ్చారు. పార్కులు, ఆటస్థలాల అభివృద్ధి, కమ్యూనిటీ హాళ్లకు తదుపరి వరుసలో చోటు కల్పించారు. జిల్లా కేంద్రం కావడంతో అత్యధికంగా నల్లగొండ మున్సిపాలిటీ ప్రణాళిక వ్యయం రూ.1200 కోట్లకు లె క్కతేలింది. ఆ తర్వాతి వరుసలో నూతనంగా ఏర్పాటైన కోదాడ ము న్సిపాలిటీ అభివృద్ధికిగాను రూ.110 కోట్లతో ప్రణాళిక రూపొందించారు. ఈ ప్రణాళికలో పొందుపర్చిన పలు రకాల అభివృద్ధి పనులకు 13వ ఆర్థిక సంఘం, బీఆర్‌జీఎఫ్, ఎంపీ, ఎమ్మెల్యే అభివృద్ధి నిధులు, సాధారణ నిధుల (జనరల్ ఫండ్) నుంచి నిధులు సమకూర్చుకోవాలని రాష్ట్ర పట్టణాభివృద్ధి శాఖ నుంచి ఉత్తర్వులు వచ్చాయి.
 
 
 నల్లగొండ మున్సిపాలిటీలో మన వార్డు మన ప్రణాళిక రూ. 1200 కోట్లతో రూపొందించారు. పట్టణంలో భూగర్భ మురుగు కాల్వల నిర్మాణానికి రూ.100కోట్లు, ఆటోల కొనుగోలుకు రూ.80 లక్షలు,  చెత్త డంపింగ్ యార్డులకు రూ. 20 కోట్లు, కూరగాయలు, చేపలు, మాంసం దుకాణాల ఆధునికీకరణకు రూ. 40 కోట్లు, గ్రంథాలయాలకు రూ. 60లక్ష లు, వరద కాల్వ నిర్మాణానికి రూ.100 కోట్లు, వీది దీపాల లైన్లు ఆధునికీకరణకు రూ.50 కోట్లు, సోలార్ ప్లాంట్లు కు రూ.100 కోట్లు, పాదచారుల బాటలకు రూ. 5 కోట్లు, పార్కులు రూ. 5 కోట్లు, అతిథి గృ హ నిర్మాణానికిరూ. 10 కోట్లు, అధికారుల క్వార్టర్ల నిర్మాణాలకు రూ. 5 కోట్లు, పశువధశాలకు రూ.15 కోట్లు, క్రీడా మైదానం రూ.20 కోట్లు కేటాయించారు. వివిధ రకాల ప్రాధాన్యత గల అభివృద్ధి పనులకు రూ.758.40 కోట్లు కేటాయించారు.
 
 భువనగిరి మున్సిపాలిటీ..
 భువనగిరి మున్సిపాలిటీకి మన ప్రణాళికలో భాగంగా.. సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.11.24 కోట్లు, మురికికాల్వలకు రూ10.55 కోట్లు, నీటిసరఫరాకు రూ 5.57 కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ 4 .57కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.4.10 కోట్లు,పార్కుల అభివృద్ధికి రూ 3.60 కో ట్లు,వీధిదీపాల ఏర్పాటుకు రూ 1.97 కోట్లు, బస్‌షెల్టర్లకు రూ 96 లక్షలు,మూత్రశాలల నిర్మాణానికి రూ.51 లక్షలు, మార్కెట్ అభివృద్ధికి రూ.43 లక్షల అంచనా వ్యయంతో ప్రణాళికలను తయారు చేశారు.
 
 సూర్యాపేట మున్సిపాలిటీ..
 సూర్యాపేట మున్సిపాలిటీలో అధికారులు రూపొందించిన ప్రణాళిక ప్రకారం సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.5.62 కోట్లు, మురుగు కాల్వలకు రూ.5.41 కోట్లు,  తాగునీటిసరఫరాకు రూ.6.80కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ.8.65 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.1.65 కోట్లు, పార్కుల అభివృద్ధికి రూ.4.60 కోట్లు, వీధిదీపాల ఏర్పాటుకు రూ.6.5కోట్లు, బస్‌షెల్టర్లకు రూ.15 లక్షలు, పట్టణంలోకి ప్రవేశించే నాలుగు ముఖద్వారాల్లో ఆర్చీల నిర్మాణానికి  రూ.80 లక్షలు, అంగన్‌వాడీ భవనాల నిర్మాణాలకు రూ.3 కోట్లు, శ్మశానవాటిక స్థలం కొనుగోలుకు రూ.కోటి, మున్సిపల్ కార్యాలయం నిర్మాణానికి రూ.5 కోట్లు, భిక్షాటన చేసే వారి కోసం ప్రత్యేక షెల్టర్  నిర్మాణానికి రూ.30 లక్షలు, మూత్రశాలల నిర్మాణాలకు రూ.2.90 కోట్లు, ఇతర అభివృద్ధి పనులకు రూ.2.70 కోట్లతో ప్రణాళిక రూపొందించారు.
 
 హుజూర్‌నగర్ నగర పంచాయతీ..
 హుజూర్‌నగర్ నగర పంచాయతీ ప్రణాళిక రూ. 62.82 కోట్ల ప్రతిపాదనలు రూపొందించారు. తాగునీటి సరఫరాకు రూ.12.80 కోట్లు, శ్మశానవాటికల అభివృద్ధికి రూ.3.65 కోట్లు, డ్రెయినేజీలకు 19.45కోట్లు, సీసీరోడ్ల నిర్మాణాలకు రూ.20.55 కోట్లు, వీధిలైట్లకు రూ.5.35 కోట్లు, చెత్త డంపింగ్ యార్డు నిర్మాణానికి కోటి రూపాయలతో ప్రతిపాదనలు సిద్ధం చేశారు.
 
 దేవరకొండ నగర పంచాయతీ..
 దేవరకొండ నగర పంచాయతీ ప్రణాళిక రూ.84 కోట్లతో సిద్ధం చేశారు. దీంట్లో తాగునీటి సరఫరాకు రూ.12 కోట్లు, మురికి కాల్వల నిర్మాణాలకు రూ.36 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.30 కోట్లు, వీధి దీపాలకు రూ.2 కోట్లు, చెత్త డంపింగ్ యార్డుల నిర్మాణాలకు రూ.2 కోట్లు, శ్మశానవాటికలు నిర్మించేందుకు రూ.2 కోట్లతో ప్రణాళిక రూపొందించారు.

 కోదాడ మున్సిపాలిటీ..
 కోదాడ మున్సిపాలిటీలో మొత్తం రూ.110 కోట్లతో ప్రణాళిక రూపొం దించారు. దీంట్లో తాగునీటి సరఫరాకు రూ.7.60 కోట్లు, డ్రెయినేజీలకు రూ.28.61 కోట్లు, సీసీ రోడ్లకు రూ. 3 7.36 కోట్లు, కమ్యూనిటీ హాల్స్ నిర్మాణాలకు రూ.7.85 కోట్లు, శ్మశాన వాటికలకు రూ.7.65 కోట్లు, కమ్యూనిటీ టాయిలెట్స్ నిర్మాణాలకు రూ.2.08 కోట్లు, పార్కుల నిర్మాణాలకు రూ.6.30 కోట్లు కేటాయించారు.
 
 మిర్యాలగూడ మున్సిపాలిటీ..
 మిర్యాలగూడ మున్సిపాలిటీకి మొత్తం రూ. 91.03 కోట్లతో ప్రణాళిక రూపొం దించారు. దీనిలో డ్రెయినేజీలకు రూ.36.93 కోట్లు, సీసీ రోడ్ల నిర్మాణాలకు రూ.41.70 కోట్లు, వీధిలైట్లకు రూ.5.22 కోట్లు, తాగునీరుకు రూ.3.10 కోట్లు, మరుగుదొడ్ల నిర్మాణాలకు రూ.28 లక్షలు, బోర్లుకు రూ.3 కోట్లు, ఆట స్థలాల అభివృద్ధికి రూ.80 లక్షలు కేటాయించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement