‘ఖిల్లా’పై కలెక్టర్లు.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా! | wanaparthy collector trecking at Khilla Ghanpur fort | Sakshi
Sakshi News home page

‘ఖిల్లా’పై కలెక్టర్లు.. ఉల్లాసంగా.. ఉత్సాహంగా!

Published Mon, Nov 20 2017 8:07 PM | Last Updated on Mon, Nov 20 2017 9:23 PM

wanaparthy collector trecking at Khilla Ghanpur fort - Sakshi

సాక్షి, ఖిల్లాఘనపురం(వనపర్తి): వారంతా జిల్లాల ఉన్నతాధికారులు.. ఒకరిని మించి మరొ కరు పోటీపడి ఖిల్లా గట్టును ఎక్కారు. రెం డు గంటల పాటు రాళ్లు, పొదలను దాటుకుంటూ కొండపైకి చేరుకున్నా రు.  ఆహ్లాదమైన, చారిత్రాత్మకమైన సుందరదృశ్యాలను చూసి పరశించిపోయారు. నేటికీ చెక్కుచెదరని రాతి మెట్లు, కాకతీయుల కాలంలో శత్రువుల వెన్నువిరిచిన ఫిరంగి, కరువొచ్చిన సరే నీటి తొణికిసలాడే  చెరువులు.. గుట్ట చుట్టూ పచ్చని ప్రకృతిని చూసి మురిసిపోయారు. ఆదివారం ఉదయం హైదరాబాద్‌ కు చెందిన క్లయింబ్‌ అడ్వంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన ట్రెక్కింగ్‌లో వనపర్తి కలెక్టర్‌  శ్వేతామహంతి, జోగుళాంబ గద్వాల కలెక్టర్‌ రజత్‌కుమార్‌సైని, ఎస్పీ విజయ్‌కుమార్‌ ఆయన సతీమణితో కలిసి ఖిల్లాఘనపురం గట్టుపై ఉల్లాసంగా గడిపారు. ప్రముఖ హిమాలయ పర్వతారోహకుడు ముర ళీధర్‌ వారికి నేతృత్వం వహించారు.

ఆహ్లాద వాతావరణం
ఖిల్లాఘనపురం కోటను పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేసి కాకతీయుల నాటి కట్టడాలు, కళావైభవాన్ని నలుదిక్కుల చాటుదామని కలెక్టర్‌ శ్వేతామహంతి అన్నారు. కోటలోకి రావాలంటే ఎంతో వైభవంగా నిర్మించిన  మూడు ముఖద్వారాలు నిర్మించారని తెలిపారు. మూడో ద్వారం వద్ద తాగునీటి వసతి, అతిథులు వస్తే ఉండటానికి ఏర్పాట్లు ఉన్నాయన్నారు. నేటికీ చెక్కుచెదరని రాతి మెట్లు, ఫిరంగి, సంవత్సరాంతం నీటితో ఉంటే చెరువులు.  గుట్ట చుట్టు పచ్చని చెట్లు ఆహ్లాదభరితంగా ఉన్నాయని తెలిపారు. మరోసారి వచ్చినప్పుడు చెరువులు, మబ్బుశలిమే, నీటిగుండం, పాలగుండం తదితర వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించడం జరుగుతుందన్నారు.

‘ఖిల్లా’ గట్టుపై పోటాపోటీగా ట్రెక్కింగ్‌
ఖిల్లాలో క్లయింబ్‌ అడ్వంచర్‌ క్లబ్‌ సభ్యులు
హైదరాబాద్‌కు చెందిన క్లయింబ్‌ అడ్వంచర్‌ క్లబ్‌ ఆధ్వర్యంలో 50మంది ఐటీ విద్యార్థులు ఖిల్లాను చూడటానికి వచ్చారు. కాకతీయుల కాలంనాటి కట్టడాలు ఎంతో వైభవంగా ఉన్నప్పటికీ అభివృద్ధికి నోచు కోలేదు. ఈ క్లబ్‌ వారు కలిసి తరుచుగా పర్యాటకులను ఇక్కడికి తీసుకురావడం జరుగుతుందన్నారు. పర్యాటకులకు కావాల్సిన మరుగుదొడ్లు, స్నానపు గదులు, టెంట్లు తదితర ఏర్పాట్లను  ఎంపీపీ కృష్ణానాయక్‌ ఏర్పాటు చేశారు. ఇకనుంచి ఈ ప్రాంతంపై ప్రత్యేక దృష్టిసారిస్తామన్నారు. కార్యక్రమంలో వనపర్తి జిల్లా డీఆర్‌డీఓ గణేష్‌నాయక్, డీపీఓ వీర బుచ్చయ్య, డీఎఫ్‌ఓ ప్రకాష్, డీపీఆర్‌ఓ వెం కటేశ్వర్లు, శారద, ఎంపీపీ కృష్ణానాయక్, జెడ్పీటీసీ రమేష్‌గౌడ్‌తో పాటు ఆమె ఖిల్లాను పరిశీలించారు. కలెక్టర్‌ వెంట వివిధ శాఖల అధికారులు, ప్రజాప్రతినిధులు, నాయకులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పర్య టించారు.


ఆహ్లాదంగా ఉంది
ఖిల్లాఘనపురంలో ఉన్న ఖిల్లా ఎంతో ఆహ్లాదంగా ఉంది. గుట్టపై కాకతీయుల కాలంనాటి కట్టడాలు చాలా ఉన్నాయి. ప్రత్యేక చొరవతీసుకుని అభివృద్ధి చేస్తే పర్యాటక కేంద్రంగా తయారవుతుంది.
– రంజిత్‌కుమార్‌ సైని, కలెక్టర్, గద్వాల జిల్లా

కట్టడాలను కాపాడుకోవాలి
16వ శతాబ్ద కాలంలో ఈ ప్రాంతాన్ని కాకాతీయ రాజులు పరిపాలించారు. ఎన్నో కట్టడాలను ఇక్కడ నిర్మించడం జరిగింది. ఎంతో నైపుణ్యంతో వారు చేపట్టిన కట్టడాలు నేటి ప్రజలను ఆకర్శించడం జరుగుతున్నాయి. ప్రభుత్వం వాటిని  ప్రాచుర్యంలోకి తీసుకురావాల్సి ఉంది.
– మురళీధర్, హిమాలయ అధిరోహకులు

అభివృద్ధి చేస్తే బాగుంటుంది
కాకతీయ రాజుల చరిత్రను తెలిపే ఈ ఖిల్లాను పర్యాటక కేంద్రంగా ప్రభుత్వం అభివృద్ధి చేస్తే బాగుంటుంది. గుట్టలో ఎన్నో చూడదగిన ప్రదేశాలు ఉన్నాయి. కలెక్టర్‌తో కలిసివెళ్లి చూడటం జరిగింది. చాలా సంతోషంగా ఉంది.
– విజయ్‌కుమార్, ఎస్పీ, గద్వాల జిల్లా

న్యూఇయర్‌కు వస్తాం
కలెక్టర్‌ శ్వేతామహంతి చొరవతో మా క్లబ్‌ ఆధ్వర్యంలో 50మంది ఇంజనీరింగ్‌ విద్యార్థులు ఇక్కడకు రావడం జరిగింది. శనివారం సాయంత్రం నుంచి ఎంపీపీ కృష్ణానాయక్‌ అన్ని ఏర్పాట్లు చేశారు.  ఖిల్లాపై ఉన్న  ఫిరంగి, చెరువులు, కట్టడాలు తదితర వాటిని చూసి సంతోషంతో వెళ్తున్నాం. కొత్త సంవత్సరాన్ని ఇక్కడే జరుపుకునేందుకు ఏర్పాట్లు చేస్తున్నాము. ఎక్కువమంది విద్యార్థులతో వచ్చి సెలబ్రేట్‌ చేసుకుంటాం.
– ఆశిష్, క్లయింబ్‌ అడ్వంచర్‌ క్లబ్‌ మేనేజర్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement