
వనపర్తి రూరల్ : కఠోర శ్రమ చేస్తే విజయం వరిస్తుందని విద్యార్థి దశలో అటు విద్య ఇటు క్రీడలను సమతూకంలో చూడాలని ప్రణాళిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు సింగిరెడ్డి నిరంజన్‌రెడ్డి అన్నారు. శుక్రవారం మండలంలోని మర్రికుంట గిరిజన గురుకుల సంక్షేమ బాలికల కళాశాలలో ఫోర్త్, థర్డ్ జోన్ క్రీడలను ఆయన ప్రారంభించి మాట్లాడారు. ప్రభుత్వం విద్యకు ప్రధాన్యత ఇస్తుందన్నారు. వనపర్తికి తప్పకుండా గురుకుల డిగ్రీ కళాశాలను తీసుకొస్తామన్నారు. కిలిమంజారో శిఖరాన్ని అధిరోహించిన క్రీడాకారిణిని సునీతను సన్మానించారు.
అన్ని రంగాల్లో రాణించాలి
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలని కలెక్టర్ శ్వేతామహంతి అన్నారు. బాలికల్లో పోటీతత్వం పెరిగిందని అన్ని రంగాల్లోనూ రాణిస్తున్నారన్నారు. క్రీడలంటే గెలుపోటములే ప్రధానం కాదని సోదరభావం, సహయ సహకారాలు పెంపొందుతాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ క్రీడలో కబడ్డీ, ఖోఖో, వాలీబాల్, బ్యాడ్‌మెంటన్, అ«థ్లెటిక్స్ విభాగాల్లో క్రీడలను నిర్వహిస్తుండగా పాత మహబూబ్‌నగర్, మెదక్, నల్గొండ, రంగారెడ్డి జిల్లాల నుంచి క్రీడాకారులు హజరయ్యారు. కార్యక్రమంలో గిరిజన గురుకులాల ఉప కార్యదర్శి విజయలక్ష్మి, రీజినల్ కోఆర్డినేటర్ వెంకటరత్నం, రాష్ట్ర క్రీడల అధికారి రమేష్‌కుమార్, అధికారి కల్యాణ్, కళాశాల ప్రిన్సిపాల్ లక్ష్మయ్య, ఎంపీపీ శంకర్‌నాయక్, మున్సిపల్ చైర్మన్ పలుస రమేష్, కౌన్సిలర్లు వాకిటీశ్రీధర్, లోక్‌నాథ్‌రెడ్డి పాల్గొన్నారు.