కరీంనగర్ : తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై రగడ మొదలైంది. రోజుకో మలుపు తిరుగుతూ అధికార పక్షానికి, విపక్ష పార్టీలకు మధ్య సవాల్‌గా మారింది. భూనిర్వాసితుల పోరాట సమితి తన కార్యాచరణను ప్రకటించడంతో మరింత వేడి రాజుకుంది. గత నెలరోజులుగా అధికార పక్షానికి, విపక్షానికి రిజర్వాయర్‌పై మాటల యుద్ధం కొనసాగుతోంది. జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇదే అదునుగా భావించి రిజర్వాయర్ పరిధిలోని మానకొండూర్, హుస్నాబాద్ నియోజకవర్గాల రైతులతో కమిటీలు ఏర్పాటు చేసి నిరసన కార్యక్రమాలను కొనసాగిస్తోంది.
ఇటీవలనే ఆ పార్టీ ఆధ్వర్యంలో తోటపల్లి రిజర్వాయర్‌కు శంకుస్థాపన చేసిన స్థలంలో రాస్తారోకో నిర్వహించి సీఎం కేసీఆర్, నీటిపారుదల శాఖ మంత్రి హరీశ్‌రావులకు పిండప్రదానం చేసింది. తోట పల్లిని రద్దు చేసి సిద్దిపేట నియోజకవర్గంలోని తడకపల్లి రిజర్వాయర్‌కు నీరు తీసుకపోయే ప్రయత్నంలో భాగంగా కేసీఆర్, హరీష్‌రావు కుట్రలు చేస్తున్నారని కాంగ్రెస్, టీడీపీ, బీజేపీ, సీపీఐ, సీపీఎంలతో పాటు వివిధ ప్రజా సంఘాలు మండిపడుతున్నారుు.
టీడీపీ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో తోటపల్లి రద్దుపై సోమవా రం గాగిల్లాపూర్ వద్ద రాజీవ్ రహదారిపై రాస్తారోకో నిర్వహించారు. సీపీఐ ఆధ్వర్యంలో సైతం ఇటీవలనే మండలాల వారీగా సమావేశాలు నిర్వహించారు. హు స్నాబాద్‌లో భారీ బహిరంగ సభను ఏర్పాటు చేసి పా దయాత్ర ద్వారా హైదరాబాద్‌కు చేరుకొని సీఎం ఇంటి ని ముట్టడించాలని నిర్ణరుుంచారు. కాంగ్రెస్ పార్టీ ఈనెల 5లోపు ప్రభుత్వం నుంచి తోటపల్లి రిజర్వాయర్‌పై స్పష్టమైన ప్రకటన రాకుంటే 12న రాజీవ్ రహదారిని దిగ్భందించి, వంటావార్పు, నిరసన కార్యక్రమాలను చేపడుతామని ప్రకటించింది.
ఇదే క్రమంలో సీఎం కేసీఆర్ ఈ నెల 8న హుస్నాబాద్ నియోజకవర్గం లో పర్యటించిన సందర్భంగా తోటపల్లి రిజర్వాయర్ రద్దుపై కీలక వ్యాఖ్యలు చేశారు. రిజర్వాయర్‌ను తా ము రద్దు చేయడం లేదని, ఆ పని ఇంజనీరింగ్ నిపుణులది ఆయన పేర్కొన్నారు. సీఎం స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాలు యథావిధిగా కొనసాగుతాయని డీసీసీ అధ్యక్షుడు కటుకం మృత్యుంజయం పేర్కొన్నారు.
నేడు రాజీవ్ రహదారి దిగ్బంధం, వంటావార్పు
తోటపల్లి రిజర్వాయర్ రద్దును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో బెజ్జంకి మండలం గాగిల్లాపూర్ స్టేజీ వద్ద బుధవారం ఉదయం 10 గంటల నుంచి ఆందోళన చేపట్టనున్నా రు. రాజీవ్ రహదారి దిగ్భంధం, వంటావార్పు చేపట్టనున్నారు. మంగళవారం డీసీసీ కార్యాలయంలో మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, బొమ్మ వెంకన్నతో పా టు కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాల అధ్యక్షులు, సీ నియర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, ప్రజాప్రతినిధు లు సమావేశమై నిరసన కార్యక్రమాన్ని జయప్రదం చేసేం దుకు వ్యూహరచన చేశారు. కాంగ్రెస్ పార్టీ ప్రతినిధి బృందం సాయంత్రం గాగిల్లాపూర్ గ్రామాన్ని సందర్శించి దీనికి సంబంధించిన ఏర్పాట్లను పరిశీలించింది.
పీసీసీ చీఫ్ రాక
టీపీసీసీ చైర్మన్ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి తోటపల్లి రిజర్వాయర్ నిరసన కార్యక్రమంలో పాల్గొనేందుకు జిల్లాకు రానున్నారు. డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం, సీఎల్పీ ఉపనేత జీవన్‌రెడ్డి, ఎమ్మెల్సీ సంతోష్‌కుమార్, మాజీ మంత్రి శ్రీధర్‌బాబు, మాజీ ఎంపీలు పొన్నం ప్రభాకర్, వివేక్, మాజీ ఎమ్మెల్యేలు ఆరెపల్లి మోహన్, అల్గిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, టీపీసీసీ కార్యదర్శి బొమ్మ శ్రీరాంచక్రవర్తి, భూనిర్వాసితుల పోరాట సమితి కమిటీ కన్వీనర్ కేడెం లింగమూర్తితో పాటు కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు పెద్ద ఎత్తున నిరసన కార్యక్రమాల్లో పాల్గొననున్నారు.
జయప్రదం చేయండి : కటుకం మృత్యుంజయం
రాజీవ్హ్రదారి దిగ్భంధం, వంటావార్పు కార్యక్రమాల్లో కాంగ్రెస్ పార్టీ శ్రేణులతో పాటు అన్ని వర్గాల ప్రజలు, ముంపు గ్రామాల నిర్వాసితులు పెద్ద ఎత్తున పాల్గొని టీఆర్‌ఎస్ ప్రభుత్వానికి కనువిప్పు కలి గించేలా జయప్రదం చేయాలని డీసీసీ అధ్యక్షులు కటుకం మృత్యుంజయం పిలుపునిచ్చారు. డీసీసీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం కేసీఆర్ మాటలకు చేతలకు పొంతన లేదని అన్నారు. తోటపల్లి రిజర్వాయర్‌ను రద్దు చేసి తడకపల్లిలో ప్రాజెక్టు నిర్మించి సిద్దిపేట, గజ్వేల్ నియోజకవర్గాలకు నీళ్లను దొంగలించే ప్రయత్నం చేస్తున్నాడని, దీనిని అడ్డుకొని తీరుతామని అన్నారు. అధికార పార్టీకి తొత్తులుగా వ్యవహరిస్తూ పోలీసులు అతిగా ప్రవర్తించడం మానుకోవాలన్నారు.
అడ్డుకుంటే తీవ్ర పరిణామాలు : పొన్నం
రాజీవ్ రహదారి దిగ్బంధనానికి పోలీసులు అటంకం కలిగించవద్దని, ప్రజాస్వామ్య ప్రక్రియలో నిరసన ఒక భాగామని మాజీ ఎంపీ పొన్నం ప్రభాకర్ అన్నారు. శాంతియుతంగా జరిగే ఆందోళన కార్యక్రమానికి విఘాతం కలిగిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయన్నారు.
రగడ మొదలైంది
Published Wed, Aug 12 2015 4:40 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement