సంగారెడ్డి జిల్లా చాప్టా(బీ)లో వ్యవసాయ బోరు నుంచి నీటిని మోసుకొస్తున్న మహిళలు
వేసవిలో తాగునీటి ఎద్దడిని నివారించేందుకు గ్రామీణ నీటి సరఫరా విభాగం ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయాల్సి ఉంది. ఈ ఏడాది మార్చిలోగా అన్ని జనావాసాలకు ‘మిషన్ భగీరథ’ ద్వారా తాగునీరు అందించాలని ప్రభుత్వం నిర్దేశించింది. ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో ‘మిషన్ భగీరథ’ పథకం పనులు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. మరోవైపు గ్రామాల్లో అంతర్గత పైపులైన్ల నిర్మాణం చాలా చోట్ల ప్రారంభం కాలేదు. మిషన్ భగీరథ ద్వారా ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో వేసవిలో తాగునీటి సరఫరా అసాధ్యంగా కనిపిస్తోంది. ఇప్పటికే మారుమూల గ్రామాలు, గిరిజన తండాల్లో మొదలైన తాగునీటి సమస్యపై ‘సాక్షి’ గ్రౌండ్ రిపోర్ట్...
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో రెండున్నర వేలకు పైగా జనావాసాలు ఉన్నాయి. వీటిలో 1,700కు పైగా జనావాసాల్లో మాత్రమే సంపూర్ణంగానో, పాక్షికంగానో వివిధ తాగునీటి పథకాల ద్వారా సరఫరా అవుతోంది. గ్రామీణ ప్రాం తాల్లో సీపీడబ్ల్యూఎస్, పీడబ్ల్యూఎస్, ఎంపీడబ్ల్యూఎస్ తదితర పథకాల కిం ద గ్రామీణ నీటి సరఫరా విభాగం తాగునీటిని అందిస్తోంది. తాగునీటి పథకాలు, బోరు మోటార్లు లేని చోట చేతి పంపులు దాహార్తిని తీరుస్తున్నా యి. ఏటా వేసవిలో భూగర్భ జలా లు అడుగంటుతుండడంతో తాగునీ టి పథకాలు వట్టిపోతున్నాయి. ప్రస్తు తం ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలో సగటు భూగర్భ జలమట్టం ఉపరితలం నుంచి 16.07 మీటర్లుగా నమోదైంది. వేసవిలో మే నాటికి భూగర్భ జలమట్టం 17 నుంచి 19 మీటర్ల లోతుకు పడిపోయే అవకాశం ఉంది. సింగూరు నుంచి ఈ ఏడాది దిగువకు నీటిని విడుదల చేయడంతో ప్రస్తు తం ప్రాజెక్టులో 13 టీఎంసీల నీరు మాత్రమే నిల్వ ఉంది. దీంతో మంజీ ర తీర ప్రాంత గ్రామాలతో పాటు గిరిజన తండాలు, మారుమూల గ్రా మాల్లో తాగునీటి సమస్య తీవ్ర రూ పం దాలుస్తోంది. సంగారెడ్డి జిల్లా పరిధిలోని నారాయణఖేడ్, హత్నూ ర, ఆర్సీపురం, జహీరాబాద్, రాయికోడ్ తదితర మండలాల్లో ఇప్పటికే సగటు భూగర్భ జలమట్టం 19 మీట ర్ల లోతున ఉంది. మెదక్ జిల్లా రామాయంపేట, చిన్నశంకరంపేట, సిద్దిపేట జిల్లా హుస్నాబాద్, ములుగు ప్రాంతాల్లోనూ భూగర్భ జల మట్టం వేగంగా పడిపోతోంది.
పూర్తి కాని మిషన్ భగీరథ
మిషన్ భగీరథ పనులు పూర్తి చేసి ఇంటింటికీ తాగునీరు అందిస్తామని ప్రభుత్వం చెబుతున్నా.. క్షేత్ర స్థాయి లో పనులు మాత్రం నత్తనడకన సాగుతున్నాయి. సింగూరు రిజర్వాయర్ వ ద్ద ఇంటేక్‌వెల్‌తో పాటు ఫిల్టర్‌బెడ్ ప నులు పూర్తయినా.. గ్రామాల్లో అం తర్గత పైపులైన్ల పనులు జరగడం లేదు.
♦ సంగారెడ్డి జిల్లాలో ‘ఇంట్రా విలేజి’లో భాగంగా మొదటి దశలో రూ. 57.48 కోట్లతో మునిపల్లి, న్యాలకల్, ఝరాసంగం మండలాల్లో పనులు జరుగుతున్నాయి. మిగతా మండలా ల్లో రూ.335.41 అంచనా వ్యయంతో రెండో దశ పనులు ప్రారంభమయ్యా యి. రేట్లు గిట్టుబాటు కావడం లేదనే కారణంగా కాంట్రాక్టర్లు పనులు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. మిషన్ భగీరథలో కీలకమైన ఓహెచ్‌ఎస్‌ఆర్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. రూ.335.41 కోట్ల అంచనా వ్యయంతో 794 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు మంజూరు కాగా, కేవలం 400 ట్యాంకుల నిర్మాణం జరుగుతోంది.
♦ మెదక్ జిల్లాలో ఇంట్రా విలేజీలో మొదటి దశలో నర్సాపూర్ సెగ్మెంట్ లో రూ.69.61 కోట్లు, గజ్వేల్ సెగ్మెం ట్‌లో రూ.47.04 కోట్ల పనులు పురోగతిలో ఉన్నాయి. రెండో దశలో రూ. 178.43 కోట్ల పనులు చేపట్టినట్లు చెబుతున్నా పురోగతి లేదు. ‘ఇంట్రా గ్రిడ్’ కింద 22 మండలాలకు 376 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లు మంజూరు కాగా, 241 పనులు పురోగతిలో ఉన్నాయి.
♦ సిద్దిపేట జిల్లాలో 487 ఓహెచ్‌ఎస్‌ఆర్‌లకు గాను వంద పనులు పురోగతిలో ఉన్నాయి. ఇంట్రాలో భాగంగా 2,574 కిలోమీటర్ల మేర పై పులైను వేయాల్సి ఉండగా, చాలా గ్రా మాల్లో పనులు ప్రారంభం కాలేదు.
వేసవి కార్యాచరణ ఏదీ?
భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం, తాగునీటి పథకాలు వట్టి పోతుండడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం ఏటా ‘వేసవి కార్యాచర ణ ప్రణాళిక’ సిద్ధం చేస్తోంది. విపత్తు నివారణ నిధి (సీఆర్‌ఎఫ్) ట్యాంకర్ల ద్వారా రవాణా, బోరు బావులను అద్దెకు తీసుకోవడం ద్వారా తాగునీటి గండం నుంచి జనావాసాలు గట్టెక్కుతున్నాయి. మరోవైపు నాన్ సీఆర్‌ఎఫ్ నిధి నుంచి చేతి పంపుల మరమ్మతు, బోరు బావుల్లో పూడిక తీత, లోతు చేయడం, బోరు మోటార్ల మరమ్మ తు, పైపులైన్లు పొడగింపు వంటి పను లు వేసవి కార్యాచరణ ప్రణాళికలో పొందు పర్చాల్సి ఉంటుంది. ఈ ఏడా ది మార్చి నాటికి ఉమ్మడి మెదక్ జిల్లా పరిధిలోని జనావాసాలన్నింటికీ మిష న్ భగీరథ ద్వారా ఇంటింటికీ తాగునీటి సరఫరాకు ప్రభుత్వం ఆదేశించిం ది.
ఈ పథకంలో అత్యంత కీలకమైన మెయిన్ ట్రంక్ (ప్రధాన పైపులైను) పనులు మాత్రమే పూర్తి కాగా, ఓహెచ్‌ఎస్‌ఆర్, ఇంట్రా (అంతర్గత పైపులైన్) పనులు చాలాచోట్ల అసంపూర్తిగా ఉ న్నాయి. కార్యాచరణ ప్రణాళిలో భాగంగా నీటి ఎద్దడి ఎదురయ్యే జనావాసాలను ముందస్తుగా గుర్తించాల్సి ఉంటుంది. సమస్యాత్మక ప్రాంతాలు, స్థానికంగా అందుబాటులో ఉండే నీటి వనరులు, చేతి పంపుల మరమ్మతు, రవాణాకయ్యే ఖర్చును అంచనా వేయాలి. ఎన్ని జనావాసాలకు రవాణా చేయాల్సి ఉంటుంది. మిషన్ భగీరథ నీరు ఇస్తున్నందున వేసవి కార్యాచరణ అవసరం లేదనే అభిప్రాయంతో ప్రభుత్వం ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment