వ్యవసాయాన్ని పండుగ చేస్తాం
రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి
బాన్సువాడరూరల్ : గత పాలకులు వ్యవసాయమే దండుగ అన్నారని, కానీ తమ ప్రభుత్వం మాత్రం రైతన్నకు అండగా ఉండి వ్యవసాయాన్ని పండుగగా మారుస్తామని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. సోమవారం ఆయన జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు, పశుసంవర్ధకశాఖ డెరైక్టర్ వెంకటేశ్వర్లుతో కలిసి మండలంలోని నాగారం గ్రామంలో గొర్రెలు, మేకలకు నట్టల నివారణ మందుల పంపిణీ కార్యక్రమాన్ని లాంఛనంగా ప్రారంభించి మా ట్లాడారు. రైతులు సాంప్రదాయ సాగుకు స్వస్తిపలికి శాస్త్రసాంకేతిక రంగాల్లో వస్తున్న మార్పులను సద్వినియోగం చేసుకుంటూ అత్యధిక లాభాలు గడించాలని సూచించారు.
తెలంగాణ వ్యాప్తంగా జూ లై, జనవరి మాసాల్లో రెండువిడతలుగా 8కోట్లతో నట్టల నివారణ మందులు పంపిణీ చేస్తున్నామన్నారు. మరో నాలు గు కోట్లతో ఏప్రిల్‌మాసంలోనూ మూడోవిడత పంపిణీకి సన్నాహాలు చేస్తున్నామన్నా రు. రాష్ట్రంలో పాల ఉత్పత్తిని గణనీయంగా పెంచడానికి చర్యలు తీసుకుంటున్నా మన్నా రు. అనంతరం గొర్రెలు, మేకల పెంపకందార్లు, పశుసంవర్థక శాఖ అధికారులు మంత్రి పోచారంను ఘనంగా సన్మానించారు. గొంగళి కప్పి గొర్రెను బహుమానంగా ఇచ్చారు. పశుసంవర్థక శాఖ జేడిఏ ఎల్లన్న పాల్గొన్నారు.
రైతు గుండెచప్పుడు తెలిసిన వ్యక్తి పోచారం
రైతు గుండె శబ్ధం తెలిసిన వ్యక్తి, తెలంగాణ తొలి వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అని జిల్లా ఇన్‌చార్జి కలెక్టర్ వెంకటేశ్వరావు అన్నారు. ఇటీవల అకాల వర్షాలు పడి ధాన్యం రాశులు ఎక్కడి కక్కడ నిలిచి పోయిన సందర్భంలో వాటిని రైస్ మిల్లులకు తరలించడంలో ఎమ్మెల్యేగా ఆయన పడిన తపనను తా ను స్వయంగా చూశానని గుర్తుచేసుకున్నారు. రాష్ట్ర వ్యవసాయ శా ఖ మంత్రిగా ఆయన తెలంగాణ ప్రజలకు చక్కటి సేవలు అందిస్తారని ఆకాక్షించారు.