వ్యవసాయ రంగానికే సర్కారు ప్రాధాన్యం | the government preferred to Agricultural sector | Sakshi
Sakshi News home page

వ్యవసాయ రంగానికే సర్కారు ప్రాధాన్యం

Published Wed, Oct 1 2014 2:53 AM | Last Updated on Sat, Sep 2 2017 2:11 PM

వ్యవసాయ రంగానికే  సర్కారు ప్రాధాన్యం

వ్యవసాయ రంగానికే సర్కారు ప్రాధాన్యం

హన్మకొండ అర్బన్ :  రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయరంగానికి అధిక ప్రాధాన్యతను ఇస్తుందని రాష్ట్ర వ్యవసాయశాఖ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి అన్నారు. మంగళవారం కలెక్టరేట్ సమావేశ మందిరంలో వ్యవసాయ అనుబంధ శాఖల పనితీరు, రుణ మాఫీ అమలు వంటి తదితర అంశాలపై సమీక్షా సమీవేశం నిర్వహించారు. ముఖ్యఅతిథిగా హాజరైన మంత్రి శ్రీనివాస్‌రెడ్డి కలెక్టర్ కిషన్ సహా, పలు శాఖల అధికారులకు ఆయా అంశాలపై పలు సూచనలు, ఆదేశాలు ఇచ్చారు.

మంత్రి మాట్లాడుతూ ఎన్నికల ముందు ప్రభుత్వం ఇచ్చిన హామీల మేరకు తొ లి విడతగా రైతులకు రుణమాఫీ నిధులను బ్యాంకులకు విడుదల చేశామన్నారు. ఆ నిధులను సాధ్యమైన త్వరలో బ్యాంకర్లు అర్హులైన రైతుల ఖాతాల్లోకి జమ చేయాల న్నారు. తద్వార కొత్త రుణాలు పొందవచ్చన్నారు. జిల్లాలో వ్యవసాయానుబంధ పరిశ్రమల ఏర్పాటుకు చర్యలుతీసుకుంటామని తెలిపారు.

జిల్లాలో ఈ యేడు 82 శాతం మాత్రమే పంటల సాగు
వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా ఈ ఏడాది 5,02,132 హెక్టార్లలో వివిధ పంటలు సాగు చేయాల్సిండగా   4,11,373 హెక్టార్లలో మాత్రమే సాగు జరిగిందన్నారు. మొత్తంగా 82శాతం మాత్రమే సాగు జరిగిందని తెలిపారు. ప్రస్తుతం పంట నోటికి వచ్చిందని ఈపరిస్థితుల్లో విద్యుత్ సరఫరాలు ఇబ్బందులు కాకుండా చూస్తామని అన్నారు. రెండో పంటకు అవసరమైన విత్తనాలు, ఎరువులు సిద్ధంగా ఉంచామని మంత్రి తెలిపారు. జిల్లాకు ఇప్పటివరకు 1,03, 288 మెట్రిక్‌టన్నుల యూరియా అవసరం ఉండగా అంతకన్నా ఎక్కువగా అందినట్లు తెలిపారు. కొన్నిచోట్ల అవసరానికన్నా ఎక్కువ మొత్తంలో కొందరు అక్రమంగా నిల్వ చేయడంతో కృత్రిమ కొరత ఏర్పడుతున్నట్లు తమ దృష్టికి వచ్చింద న్నారు. ఈ విషయంలో బాధ్యులపై కఠినంగా వ్యవహరిస్తామని హెచ్చరించారు.

జిల్లాలో రూ.1888కోట్ల రుణమాఫీ.. తొలి విడతలో రూ.472 కోట్లు రుణమాఫీ రాష్ట్రంలో 36 లక్షలమంది రైతులకు 17వేల కోట్లను ప్రభుత్వం రుణ మాఫీ చేసిందని మంత్రి తెలిపారు. జిల్లాలో 4,13,523 మంది రైతులకు 1888కోట్లు రుణమాఫీ చేసినట్లు ఆయన తెలిపారు. ఇందుకు సంబంధించి తొలి విడతగా *472కోట్లు సంబందిత బ్యాంకులకు చేరినట్లు మంత్రివివరించారు.
 
ఒక్కో రైతుకు 55వేల రుణం
ప్రస్తుతం రుణ మాఫీ పొందిన ప్రతిరైతుకు * 55వేలు బ్యాంకర్లు రుణంగా చె ల్లించే లా రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమావేశంలో బ్యాంకుల ప్రతినిధులు అంగీకరించారని తెలిపారు. ప్రస్తుతం రైతుల రుణంగా ప్రభుత్వ చెల్లించిన 25శాతం(*25వేలు)తోపాటు మరో *30వేలు అదనంగా రుణం కింద ఇస్తారని మంత్రి తెలిపారు. దీంతో ఒక్కో రైతుకు 55వేలు తగ్గకుండా రుణం పొందే వెసులుబాటు ఉంటుందని ఆయనపేర్కొన్నారు. లక్ష రుణ మాఫీలో బాగంగా రైతులు చెల్లించాల్సిన మొత్తం పైసలు వడ్డీతోసహా ప్రభుత్వం చెల్లిస్తుందని అన్నారు.
 
హార్టికల్చర్ అభివృద్ధికి  44 కోట్లు
రాష్ట్రంలో ఉద్యానవన శాఖ ద్వారా 39వేల హెక్టార్లలో బిందుసేద్యం 11,700హెక్టార్లలో, తుంపర సేద్యం అమలుకు 7,397 కోట్లు కేటాయించామని ఇందులో జిల్లాలో 4500హెక్టార్లలో బిందు సేద్యం, 850హెక్టార్లలో తుంపర సేద్యానికి 44కోట్లు కేటాయించామన్నారు.
 
పశువుల కొనుగోలుకు రుణం ఇస్తాం
రాష్ట్రంలోని మహిళా సంఘాలకు స్త్రీనిధి బ్యాంకుల ద్వారా పశువులు, గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేస్తామని మంత్రి శ్రీనివాస్ తెలిపారు. ఇప్పటికే మహబూబ్‌నగర్ జిల్లా దేవరకద్ర నియోజక వర్గంలో 13కోట్లు గొర్రెల కొనుగోలుకు రుణం మంజూరు చేసిన ట్లు వివరించారు. యూనిట్‌లో 60శాతం రుణం, 20శాతం మార్జిన్ మనీ, 20శాతం సబ్సీడీ కింద రుణాలు ఇచ్చేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని అన్నారు. ఈ విధంగా జిల్లాకు 50కోట్లు ఇవ్వనున్నట్లు తెలిపారు. చేపల అమ్మకం కోసం మండల కేంద్రాలు, గ్రామాలకు మార్కెట్ల నిర్మాణం కోసం మండలకేంద్రాలకు 15లక్షలు, గ్రామాలకు 7050 లక్షలు ఇవ్వనున్నట్లు మంత్రి తెలిపారు.

విత్తన ఉత్పత్తి కేంద్రాలు
సీఎం కేసీఆర్ సూచనల మేరకు రాష్ట్రంలో పండించే వివిధ విత్తనాల కోసం ప్రతి జిల్లాలో విత్తన ఉత్పత్తి కేంద్రాలను ఏర్పాటుచేస్తామని మంత్రి అన్నారు.

45కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీ విడుదల
జిల్లాకు 54కోట్ల ఇన్‌పుట్ సబ్సిడీని ప్రభుత్వం విడుదల చేసిందని అందుకు సంబంధించిన నిధులను అర్హులైన ఆయా రైతుల ఖాతాల్లోకి జమ చేయాలని బ్యాంకర్లు, వ్యవసాయాధిరులను మంత్రి ఆదేశించారు.
 
చేపల పెంపకంపై దృష్టి సారించాలి: ఎంపీ కడియం
ఎంపీ కడియం శ్రీహరి మాట్లాడుతూ వరంగల్ కొర్రమీను చా లా రుచిగా ఉంటుందని దానికి డిమాండ్ ఎక్కువని వాటిని ఇక్కడి చెరువుల్లో పెంచేలా అధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని ఎంపీ అధికారులను ఆదేశించారు. రైతులకు ప్రయోజనం చేకూరేలా నిర్ణయాలు తీసుకోవాలని ఎంపీ రాపోలు ఆనంద భాస్కర్ కోరారు. జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎమ్మెల్సీ వెంకటేశ్వర్లు, జేసీ పౌసుమీబసు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement