మహబూబ్‌నగర్ క్రీడలు: జాతీయస్థాయి అథ్లెటిక్స్ మీట్‌లో జిల్లా క్రీడాకారులు మెరుగైన ప్రతిభ కనబరిచి పతకాలు సాధించాలని జిల్లా అథ్లెటిక్స్ సంఘం కార్యదర్శి రాజేంద్రప్రసాద్ అన్నారు. విశాఖపట్నంలో ఈనెల 5 నుంచి 7 వరకు జరిగే జాతీయ అండర్-14, అండర్-16 బాల, బాలికల అథ్లెటిక్స్ మీట్‌లో పాల్గొనే క్రీడాకారులు గురువారం తరలి వెళ్లారు. ఈ సందర్భంగా జిల్లా స్టేడియంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో రాజేంద్రప్రసాద్ క్రీడాకారులను అభినందించారు. అథ్లెటిక్స్‌లో రాష్ట్రంలోనే జిల్లాకు మంచి పేరుందని, అదే స్ఫూర్తితో పోటీల్లో అధికంగా పతకాలు పొందాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో పీడీ గజానంద్, అలీమ్, కోచ్‌లు సునీల్‌కుమార్, ఆనంద్‌కుమార్, శ్రీనివాస్, రాజు పాల్గొన్నారు.
క్రీడాకారుల వివరాలు..
లిఖిత-100మీ, క్రిష్ణవేణి-400మీ (కల్వకుర్తి)
సరిత-షాట్‌ఫుట్ (బల్మూర్)
మహేశ్వరి-జావెలిన్‌త్రో (ఎల్కిచర్ల)
రోషన్-100మీ (చిట్యాల)
శివనాయక్-షాట్‌ఫుట్ (మార్చాల)
శేఖర్-100మీ (వంగూర్)
రాజేందర్-200మీ (తూడుకుర్తి)
నరేశ్-1000మీ (ఖిల్లాఘణపురం)
అరుణ్-హైజంప్ (నేరెళ్లపల్లి)
లక్ష్మణ్-లాంగ్‌జంప్ (మాడ్గుల)
శ్రీను-షాట్‌ఫుట్ (బాలానగర్).
'జాతీయ అథ్లెటిక్స్‌లో రాణించాలి'
Published Thu, Sep 3 2015 4:54 PM | Last Updated on Mon, Oct 8 2018 5:04 PM
Advertisement