
'సమస్యలను పరిష్కరించే వరకూ పోరాటం'
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఉద్యోగుల సమస్యలను పరిష్కరించేంత వరకూ తమ పోరాటం కొనసాగిస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం హెచ్చరించారు. తన ఆధిపత్యం చూపించడం కోసమే ముఖ్యమంత్రి కేసీఆర్ మున్సిపల్ ఉద్యోగులను విభజించి పాలిస్తున్నారన్నారు. ఏడాది గడిచినా ప్రభుత్వం ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదని మండిపడ్డారు.
ఈ నేపథ్యంలో గ్రామీణ, మున్సిపల్ ఉద్యోగుల సమస్య పరిష్కారానికి ఐదు రోజుల పాటు బస్సుయాత్ర చేపడుతున్నట్లు తమ్మినేని తెలిపారు. త్వరలో వామపక్ష పార్టీ బస్సుయాత్ర ప్రారంభమవుతుందన్నారు.