రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు.
కరీంనగర్ : రాష్ట్రంలో ఖాళీగా ఉన్న వైస్ ఛాన్స్లర్ పోస్టులను త్వరలో భర్తీ చేస్తామని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి తెలిపారు. యూనివర్సిటీల్లో ఖాళీగా ఉన్న పోస్టులన్నీ భర్తీ చేసేందుకు కృషి చేస్తున్నామని ఆయన ఆదివారమిక్కడ పేర్కొన్నారు. గత ప్రభుత్వాల హయాంలో యూనివర్సిటీలు భ్రష్టు పట్టాయని, తమ ప్రభుత్వం వర్సిటీలను మెరుగుపరిచి నాణ్యమైన విద్యను అందించేందుకు కృషి చేస్తుందని కడియం శ్రీహరి తెలిపారు.,