యురేనియం తవ్వకాలను అడ్డుకుంటాం: మాజీ ఎమ్మెల్యే డాక్టర్ వంశీకృష్ణ
Published Mon, Feb 27 2017 5:08 PM | Last Updated on Tue, Sep 5 2017 4:46 AM
అమ్రాబాద్(అచ్చంపేట) : ప్రజా ఉద్యమాలతో నల్లమలలో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ అన్నారు. అమ్రాబాద్, పదర మండలాల్లో యురేనియం తవ్వకాల అనుమతులను నిలిపివేయాలని డిమాండ్ చేస్తూ కాంగ్రెస్ ఆధ్వర్యంలో అమ్రాబాద్‌లో నిర్వహిస్తున్న రిలేనిరాహార దీక్షలు 21రోజులుగా కొనసాగుతున్నాయి. ఆదివారం పదర మండలం వంకేశ్వరం గ్రామస్తులు దీక్షలో కూర్చున్నారు. వంశీకృష్ణ దీక్షలను ప్రారంభించి మాట్లాడారు.
ఈ ప్రాంతంలో యురేనియం తవ్వకాలతో మానవ మనుగడ కనుమరుగవుతుందని అన్నారు. అంతేగాకుండా తెలంగాణ ఊటీగా పిలుచుకుంటున్న ప్రకృతి అందాలు, అడవులు, వన్యప్రాణులు ధ్వంసమవుతాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ప్రాంత పరిరక్షణ కోసం అన్ని గ్రామాలలో దూంధాం కార్యక్రమాలతో ప్రజలను చైతన్యం చేసి ప్రజా ఉద్యమాలతో యురేనియం తవ్వకాలను అడ్డుకుంటామని ఆయన అన్నారు. దీక్షలో కాంగ్రెస్ మండల అధ్యక్షడు జెట్టెప్ప, మాజీ ఎంపీటీసీ విజ్జప్ప, సత్యాలు, చిన్నరామయ్య, సింగిల్‌విండో డైరెక్టర్ వెంకటేశ్వర్లు రామయ్య, శ్రీనివాసులు, సత్యం, వెంకటయ్య, రాఘవులు, రామలింగయ్య, వెంకటేశ్వర్లు, రాజేష్, తిరుపతయ్య, హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు.
Advertisement