దళిత హక్కుల పరిరక్షణకు నిరంతర కృషి | we will take continuous struggle for scheduled rights protection | Sakshi

దళిత హక్కుల పరిరక్షణకు నిరంతర కృషి

Published Mon, Feb 23 2015 5:19 PM | Last Updated on Sat, Sep 15 2018 3:59 PM

we will take continuous struggle for scheduled rights protection

హైదరాబాదు సిటీ (కాచిగూడ): కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు దళితుల కోసం కేటాయించే నిధులు, సంక్షేమ పథకాలన్నీ క్షేత్రస్థాయి వరకు అర్హులందరికి అందే విధంగా దళిత హక్కుల పరిరక్షణ ఫోరం నిరంతరం కృషి చేస్తుందని ఫోరం రాష్ట్ర అధ్యక్షులు జి.కృష్ణ అన్నారు. సోమవారం కాచిగూడలోని దళిత హక్కుల పరిరక్షణ ఫోరం కార్యాలయంలో ముషీరాబాద్ నియోజకవర్గ నూతన కార్యవర్గాన్ని ప్రకటించింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దళితుల అభ్యున్నతే లక్ష్యయంగా పనిచేస్తున్న ఫోరంకు దళితులందరూ పూర్తి సహాయ సహకారాలు అందించాలని కోరారు. సంక్షేమ పథకాల్లో దళితులకు దక్కాల్సిన వాటా రాకపోతే ఉద్యమిస్తామన్నారు. ప్రభుత్వం పంపిణీ చేసిన భూముల చట్టబద్ధతకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all

Video

View all
Advertisement