రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం | Wi-fi facility for Railway passengers at Secunderabad railway station | Sakshi
Sakshi News home page

రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం

Published Tue, May 26 2015 1:44 AM | Last Updated on Sun, Sep 3 2017 2:40 AM

రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం

రైల్వే ప్రయాణికులకు వైఫై సదుపాయం

నేటి నుంచి సికింద్రాబాద్ స్టేషన్‌లో అందుబాటులోకి...
సాక్షి, హైదరాబాద్: రైల్వే ప్రయాణికులకు శుభవార్త! మంగళవారం నుంచి సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో వైఫై సదుపాయం  అందుబాటులోకి రానుంది. కేంద్ర మంత్రి దత్తాత్రేయ, దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ పి.కె.శ్రీవాస్తవ వైఫై సదుపాయాన్ని ప్రారంభించనున్నారు. దీంతో స్మార్ట్ ఫోన్‌ల ద్వారా లక్షలాది మందికి 30 నిమిషాల పాటు ఉచితంగా ఇంటర్నెట్ సేవలు లభించనున్నాయి.

త్వరలో  కాచిగూడ, నాంపల్లి రైల్వేస్టేషన్‌లలోనూ వైఫై సేవలను ప్రవేశపెట్టనున్నారు. అలాగే ఎ, బి కేటగిరీల కింద నమోదైన పలు ఎంఎంటీఎస్ రైల్వేస్టేషన్‌లలో కూడా ఈ సదుపాయం రానుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement