అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు! | wife and husband behind woman trafficking | Sakshi
Sakshi News home page

అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు!

Published Sat, Feb 21 2015 4:26 PM | Last Updated on Fri, Jul 27 2018 2:26 PM

అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు! - Sakshi

అమ్మాయిల అక్రమరవాణా వెనుక భార్యాభర్తలు!

నల్లగొండ, హైదరాబాద్ ప్రాంతాల నుంచి విశాఖపట్నానికి అమ్మాయిలను అక్రమ రవాణా చేయడం వెనక భార్యాభర్తల పాత్ర ఉన్నట్లు తేలింది. అయితే.. వీళ్లిద్దరూ దంపతులమని పైకి చెప్పుకొంటున్నా, వాస్తవానికి ఇద్దరూ సన్నిహితంగా వ్యవహరిస్తున్నారని.. భార్యాభర్తలు కాకపోవచ్చని పోలీసులు అంటున్నారు. సూర్యాపేట వద్ద జాతీయరహదారిపై పోలీసులు వాహనాలను తనిఖీ చేస్తుండగా ఓ వాహనంలో ఆరుగురు అమ్మాయిలు అనుమానాస్పద స్థితిలో కనిపించారు.

వారిని విచారించగా, విశాఖపట్నంలో ఓ ప్రోగ్రాం ఇచ్చేందుకు వెళ్తున్నట్లు చెప్పారు. కానీ, కారులో కండోమ్ ప్యాకెట్లు, ఇతర వస్తువులు కూడా కనిపించేసరికి పోలీసులకు అనుమానం బలపడింది. దాంతో మహిళా శిశు సంక్షేమ శాఖ అధికారుల సమక్షంలో వారిని గట్టిగా విచారించేసరికి అసలు విషయం తెలిసింది. వారిని సూర్యాపేట మేజిస్ట్రేట్ కోర్టులో ప్రవేశపెట్టారు. ఈ కేసులో నలుగురు వ్యక్తులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement