తాము పోగొట్టుకునే భూమికి రెట్టింపు భూమి ఇస్తేనే భూ సేకరణకు అంగీకరిస్తామని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసిత రైతులు అధికారులకు తేల్చి చెప్పారు.
నర్సాపూర్‌రూరల్ (మెదక్): తాము పోగొట్టుకునే భూమికి రెట్టింపు భూమి ఇస్తేనే భూ సేకరణకు అంగీకరిస్తామని ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు నిర్వాసిత రైతులు అధికారులకు తేల్చి చెప్పారు. మంగళవారం మధ్యాహ్నం నర్సాపూర్ మండలం రెడ్డిపల్లి గ్రామ రైతులతో ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టు 18డీ ఈఈ దయానంద్, మధుకాన్ సంస్థ ప్రతినిధి సాంబశివరావు సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతు తూప్రాన్ మండలం గుండ్రెడ్డిపల్లి నుంచి వెల్దుర్తి మండల కేంద్రం పక్క నుంచి మహ్మదాబాద్‌కు సుమారు 40 కిలోమీటర్ల మేర కాలువకు కాలువ నిర్మాణ ప్రతిపాదనలు పూర్తి కాగా భూములను సేకరించాల్సి ఉందని తెలిపారు.
అయితే, ఎకరంలోపు ఉన్న చిన్న రైతులే ఆ గ్రామాల్లో ఉన్నారని గ్రామస్తులు విన్నవించారు. ఆ భూములు కూడా పోతే తామంతా రోడ్డున పడుతామని చెప్పారు. అందుకే ప్రభుత్వం పది గుంటలు ఉన్న వారికి 20 గుంటలు, ఎకరా ఉన్న వారికి రెండెకరాల భూమిని ప్రత్యామ్నాయంగా ఇచ్చి కాలువను తవ్వుకోవచ్చని అధికారులకు స్పష్టం చేశారు.