ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యతిరేకిస్తూ టీ-సీఎల్పీ ఓ తీర్మానం చేసింది.
ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ నియంతలా వ్యవహరిస్తున్న తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ను వ్యతిరేకిస్తూ టీ-సీఎల్పీ ఓ తీర్మానం చేసింది. అసెంబ్లీ కమిటీ హాల్లో తెలంగాణ సీఎల్పీ నేతలు సోమవారం సమావేశమయ్యారు. ఈ భేటీకి సీనియర్ నాయకులు జానారెడ్డి, డీఎస్, టీ పీసీసీ చీఫ్ పొన్నాల లక్ష్మయ్య హాజరయ్యారు. తెలంగాణ బడ్జెట్ సమావేశాల్లో అనుసరించాల్సిన వ్యూహంపై చర్చించారు. అయితే, ఈ సమావేశానికి మాజీమంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గైర్హాజరయ్యారు.
కేసీఆర్ నియంతృత్వ పాలనను అసెంబ్లీలో ఎండగడతామని సీఎల్పీ తెలిపింది. ఎమ్మెల్యేల ఫిరాయింపులను ప్రోత్సహిస్తూ, రాజకీయం చేస్తున్న అంశాన్ని సభలో లేవనెత్తుతామన్నారు. కరెంటు కోతలు, రుణమాఫీ, రైతుల ఆత్మహత్యలు, ఫీజు రీయింబర్స్మెంట్, ఇందిరమ్మ ఇళ్లు, ఉద్యోగావకాశాలు, ప్రజారోగ్యం లాంటి అంశాలపై సభలో నిలదీస్తామని సీఎల్పీ నాయకులు తెలిపారు.