మీ సమస్యలు పరిష్కరిస్తాం
ఔట్‌సోర్సింగ్ నర్సులతో లక్ష్మారెడ్డి
హైదరాబాద్: సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రి లోని ఔట్‌సోర్సింగ్ నర్సుల సమస్యలు పరి ష్కరించేందుకు కృషి చేస్తానని రాష్ట్ర వైద్య, ఆ రోగ్య మంత్రి లక్ష్మారెడ్డి తెలిపారు. ఓ స్వచ్ఛం ద సంస్థ డయాలసిస్ సెంటర్‌ను ప్రారం భించేందుకు ఆదివారం గాంధీ ఆస్పత్రికి వచ్చిన మంత్రికి నర్సింగ్ అసోసియేషన్ నా యకులు వినతిపత్రం అందించారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం చెల్లించాలని కోరగా మంత్రి సాను కూలంగా స్పందించారు.
నర్సింగ్ సిబ్బంది ఆందోళన భగ్నం
రెగ్యులరైజ్ చేయాలని, వేతనాలు పెంచాలని డిమాండ్ చేస్తూ గాంధీ ఔట్‌సోర్సింగ్ నర్సింగ్ సిబ్బంది శనివారం ఉదయం ఆందోళన చేపట్టిన విషయం తెలిసిందే. కొంతమంది నర్సులు ఆస్పత్రి ప్రధాన భవనం పైకి ఎక్కి నిరసన వ్యక్తం చేశారు. ఆదివారం ఉత్తర మండలం డీసీపీ సుమతి, టాస్క్‌ఫోర్స్ డీసీపీ లింబారెడ్డి నేతృత్వంలో మహిళా పోలీసులు నర్సింగ్ సిబ్బంది ఆందోళనను భగ్నం చేశా రు. అనంతరం వారిని అరెస్టు చేసి కొంత మందిని బొల్లారం, మరికొంత మందిని చిలకలగూడ ఠాణాలకు తరలించారు. మం త్రి హామీతో ఆందోళన విరమించి సోమవారం నుంచి విధులకు హజరవుతున్నట్లు నర్సిం గ్ అసోషియేషన్ నాయకులు తెలిపారు.