హైదరాబాద్లో సర్వేకు మిలటరీ సాయం | will take help of army for survey, says kcr | Sakshi
Sakshi News home page

హైదరాబాద్లో సర్వేకు మిలటరీ సాయం

Published Fri, Aug 1 2014 9:06 PM | Last Updated on Wed, Aug 15 2018 9:20 PM

హైదరాబాద్లో సర్వేకు మిలటరీ సాయం - Sakshi

హైదరాబాద్లో సర్వేకు మిలటరీ సాయం

తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఈనెల 19వ తేదీన నిర్వహించాలని తలపెట్టిన ఇంటింటి సర్వే కోసం ముఖ్యమంత్రి కేసీఆర్ పూర్తి స్థాయి సన్నాహాలు చేస్తున్నారు. ఈ సర్వేలో సమస్యలన్నీ హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే ఎదురవుతాయని ఆయన అన్నారు. ఈ సమస్యలను అధిగమించేందుకు ఈ రెండు జిల్లాల్లో సర్వే కోసం మున్సిపల్ సిబ్బందితో పాటు అవసరమైతే మిలటరీ సహాయం కూడా తీసుకుంటామని ఆయన అన్నారు.

ఇంటింటి సర్వేతో మొత్తం కుటుంబాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని సేకరించాలని ముఖ్యమంత్రి కేసీఆర్ భావిస్తున్నారు. ఇలా సేకరించిన సమాచారాన్నే అన్ని పథకాలకు ఆధారంగా తీసుకోవాలని ఆయన అధికారులకు సూచించారు. అందుకోసం సర్వే విషయంలో ఎలాంటి పొరపాట్లు జరగకుండా పక్కాగా నిర్వహించాలని తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement