సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాత్రి వేళల్లో చలి తీవ్రత కొనసాగుతోంది. ఉష్ణోగ్రతలు సాధారణం కంటే గణనీయంగా పడిపోతున్నాయి. గత 24 గంటల్లో ఆదిలాబాద్‌లో 7 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది. భద్రాచలం, ఖమ్మంలలో రాత్రి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే ఏకంగా 9 డిగ్రీలు, మెదక్‌లో 6 డిగ్రీలు తగ్గి 10 డిగ్రీల చొప్పున నమోదు కావడం గమనార్హం. రామగుండంలో ఐదు డిగ్రీలు తక్కువగా 12 డిగ్రీల కనిష్ట ఉష్ణోగ్రత నమోదైంది. హైదరాబాద్‌లో 4 డిగ్రీలు తగ్గి 13 డిగ్రీల రాత్రి ఉష్ణోగ్రత నమోదైంది.
హన్మకొండలో 14, నిజామాబాద్, హకీంపేటల్లో 15, నల్లగొండ, మహబూబ్‌నగర్‌లలో 17 డిగ్రీల చొప్పున కనిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. ఇదిలావుంటే పగటి ఉష్ణోగ్రతలు సాధారణం కంటే కాస్తంత పెరిగాయి. ఖమ్మంలోనైతే సాధారణం కంటే 4 డిగ్రీలు ఎక్కువగా 35 డిగ్రీల గరిష్ట ఉష్ణోగ్రత నమోదు కావడం గమనార్హం. కాగా శని, ఆదివారాల్లో ఆదిలాబాద్ జిల్లాలో చలిగాలులు వీస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది.
రాత్రిళ్లు చలి తీవ్రం
Published Sat, Feb 3 2018 2:32 AM | Last Updated on Sat, Feb 3 2018 2:32 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment