యాకుత్‌పురా : టైలరింగ్ శిక్షణ నిమిత్తం ఇంట్లో నుంచి బయటకు వెళ్లిన ఓ యువతి అదృశ్యమైన సంఘటన రెయిన్‌బజార్ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. గురువారం ఎస్సై శ్రీనివాస్ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం.. యాకుత్‌పురా చావునీ నాదే అలీ బేగ్ ప్రాంతానికి చెందిన సయ్యద్ అస్రార్ హుస్సేన్, వాషిక్ సుల్తానాల కూతురు రహత్ సుల్తానా (23) రేతికా మసీదు ప్రాంతంలోని మాలన్ బీ మదర్సాలో కొన్ని రోజులుగా టైలరింగ్‌లో శిక్షణ పొందుతోంది.
రోజు మాదిరిగానే శిక్షణకు వెళుతున్నానని ఈ నెల 16వ తేదీన ఉదయం 11.30 గంటలకు ఇంట్లో నుంచి బయటికి వెళ్లింది. మధ్యాహ్నం 3 గంటలకు రావాల్సిన రహత్ సుల్తానా ఇంటికి చేరుకోలేదు. దీంతో ఆందోళన చెందిన కుటుంబ సభ్యులు శిక్షణ కేంద్రంతో పాటు స్నేహితులు, బంధువుల ఇళ్లలో వాకబు చేసినా ఎలాంటి ప్రయోజనం లేకుండా పోయింది. దీంతో రెయిన్‌బజార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
యువతి అదృశ్యం
Published Thu, Feb 18 2016 7:54 PM | Last Updated on Sun, Sep 3 2017 5:54 PM
Advertisement
Advertisement