
ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాళ్లు మొక్కుతున్న రాములమ్మ
కొందుర్గు: తన వ్యవసాయ భూమికి సంబంధించిన రికార్డుల్లో తప్పులు సరిచేయాలని జిల్లేడ్‌చౌదరిగూడ తహసీల్దార్ కార్యాలయానికి వెళితే పట్టించుకోవడం లేదని లచ్చంపేట గ్రామానికి చెందిన రాములమ్మ ఆవేదన వ్యక్తం చేశారు. శుక్రవారం మండల సర్వసభ్య సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే అంజయ్యయాదవ్ కాళ్లమీద పడి రికార్డులు సరిచేయించాలని వేడుకుంది. ఇందుకు ఎమ్మెల్యే స్పందిస్తూ రాములమ్మకు తగిన న్యాయం చేయాలని తహసీల్దార్ బాల్‌రాజ్‌కు సూచించారు.
Comments
Please login to add a commentAdd a comment