అదే రాహుల్ గాంధీ కోరిక
ఆలిండియా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు శోభా ఓజా
సాక్షి, హైదరాబాద్: మంచి నేతలు తయారు కావాలన్నదే కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్‌గాంధీ ఆకాంక్ష అని, అది మహిళలకే సాధ్యమవుతుందని అఖిల భారత కాంగ్రెస్ పార్టీ మహిళా అధ్యక్షురాలు శోభా ఓజా చెప్పారు. భారతదేశం అన్ని రంగాల్లోనూ ముందుకు పోతోందని, ఈ తరుణంలో మహిళల భాగస్వామ్యం కూడా అన్ని రంగాల్లోనూ ఉండాలన్నదే కాంగ్రెస్ కోరికని తెలిపారు. 105వ అంతర్జాతీయ మహిళాదినోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని గురువారం గాంధీభవన్‌లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి వచ్చిన మహిళా కార్యకర్తలతో ఆమె ఇష్టాగోష్టి నిర్వహించారు.
క్రమశిక్షణ కొరవడిన జిల్లా నేతలు రాజీనామా చేయాల్సిందేనని హెచ్చరించారు. ఇంటింటికీ తిరిగి కాంగ్రెస్‌కు ఎందుకు ఓటేయాలో చెప్పాలంటూ మహిళలకు హితవు పలికారు. దేశంలో ముఖ్యమంత్రుల్లో సగం మంది మహిళలే ఉండాలన్నది రాహుల్‌గాంధీ ఆకాంక్షని చెప్పారు. జిల్లాల్లో రెండేసి సీట్లు చొప్పున మహిళలకు కేటాయిస్తే కాంగ్రెస్ తప్పకుండా విజయం సాధిస్తుందని రాష్ర్ట మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు ఆకుల లలిత చెప్పారు. మహిళా జర్నలిస్ట్ ఉమాసుధీర్, వికలాంగుల హక్కుల కోసం పోరాడుతున్న జానకిలను ఈ సందర్భంగా సన్మానించారు.
సగంమంది సీఎంలు మహిళలే ఉండాలి: శోభా ఓజా
Published Fri, Mar 14 2014 4:44 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM
Advertisement
Advertisement