‘ఇంతింతై.. | womens day special | Sakshi
Sakshi News home page

‘ఇంతింతై..

Published Sun, Mar 8 2015 2:41 AM | Last Updated on Sat, Sep 2 2017 10:28 PM

womens day special

నేడు మహిళా దినోత్సవం
 
మహిళలు పురుషులతో సమానంగా అన్ని రంగాల్లో దూసుకెళ్తున్నారు.. తమదైన ముద్ర వేస్తున్నారు.. ఆకాశంలో సగం అంటూ సాగు నుంచి పైలట్ వరకు.. వంటింటి నుంచి సమాజ సేవ వరకు రాణిస్తున్నారు.. విధివంచితులకు అమ్మగా.. విద్యార్థులకు గైడ్‌గా.. చదువుల్లో.. ఆటల్లో.. పాటల్లో రాణిస్తూ అందరి మన్ననలు పొందుతున్నారు.. ఆదివారం మహిళా దినోత్సవం సందర్భంగా ప్రత్యేక కథనాలు
 
సమన్వయం.. ఇది మహిళకే సాధ్యమైన పనికావొచ్చు! ఇల్లూ.. పిల్లలు.. ఉద్యోగం.. సామాజిక సేవ ఇలా ఎన్నెన్నో బాధ్యతలను నేర్పుగా.. ఓర్పుగా నెరవేర్చుతున్నారు కొందరు సాధారణ మహిళలు. వీరి శ్రద్ధాసక్తులకు చిత్తశుద్ధి తోడై పది  మందితో శెభాష్
 అన్పించుకుంటున్నారు. లాభాపేక్ష  లేకుండా వీరు చేస్తున్న సేవలు   పలువురికి స్ఫూర్తిగా నిలుస్తున్నాయి.  కష్టాల్లోనూ వీరు కనబరిచిన ధృడ చిత్తం  అబ్బురపరుస్తోంది. ఏటికి ఎదురీదిన వారు  కొందరైతే.. జీవితమనే సముద్రంలో  కొట్టుకుపోతున్న వారిని అక్కున చేర్చుకుని  ఆదరించిన వారు మరికొందరు.. దైనందిన, వృత్తి  జీవితాన్ని సమన్వయం చేసుకుంటూ సమర్థంగా
 ముందుకెళ్తున్న పలువురు మహిళల పరిచయం.. నేడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం
 
బోధిస్తూ.. ప్రోత్సహిస్తూ..

 
కట్కూరు(బచ్చన్నపేట) : ఉద్యోగినిగా తన బాధ్యల నిర్వహణతోనే ఆమె సరిపుచ్చడం లేదు. విద్యార్థులకు తల్లిగానూ మార్గనిర్దేశం చేస్తున్నారు లంకా శివకుమారి. మండలంలోని కట్కూరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో తెలుగు పండిట్‌గా పనిచేస్తున్నారు. రెండు దశాబ్దాలుగా విద్యార్థుల బంగారు భవిష్యత్‌కు ఆమె బాటలు వేస్తున్నారు. భాషానైపుణ్యాలు, ఆటపాటల్లో విద్యార్థులను నిత్యం ప్రోత్సహిస్తుంటారు. మండల, డివిజన్, జిల్లాస్థాయిలో జరిగే వ్యాసరచన, వక్తృత్వం, పద్యపఠనం పోటీలకు విద్యార్థులను తీసుకెళ్లి ఎన్నో బహుమతులను వచ్చేలా చేశారు. కృత్యాల ఆధారంగా తెలుగును ఆసక్తికరంగా బోధిస్తారు.  ఎస్సెస్సీలో ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచిన విద్యార్థులకు ఏటా నగదు ప్రోత్సాహకాలు అందిస్తుంటారు. పేద పిల్లలకు అవసరయమ్యే పరికరాలు, వస్తువులను బహూకరించి అమ్మ ప్రేమను పంచుతుంటారు. శివకుమారి పనిచేసిన పాఠశాలల్లో ఉత్తమ అవార్డుతో పాటు ఇటీవల జిల్లా ఉత్తమ ఉపాధ్యాయురాలిగా అవార్డు అందుకున్నారు. ‘నా పిల్లలు చక్కగా చదువుకుని జీవితంలో స్థిరపడ్డారు. ప్రభుత్వ పాఠశాలల్లోని పిల్లలూ ఉన్నత స్థారుుకి ఎదగాలనేది నా కోరిక. అందుకే ఎప్పుడూ వాళ్లను ప్రోత్సహిస్తా. మహిళా సాధికారతను వ్యక్తిగతంగా అందరూ గౌరవించాలి. మహిళలను తక్కువగా అంచనా వేయొద్దు.’ అంటున్నారు శివకుమారి.
 
సామాజిక సేవకురాలు సులోచన
 
మహబూబాబాద్ : సామాజిక సేవలో ముందుంటూ అందరి ప్రశంసలు పొందుతున్నారు మానుకోటకు చెందిన గుండు సులోచన. 21 ఏళ్లుగా ఈమె అంగన్‌వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు. ప్రస్తుతం పట్టణ శివారులోని బీసీ కాలనీలో విధులు నిర్వహిస్తున్నారు. తల్లిదండ్రులు వదిలించుకున్న శిశువులను ఆస్పత్రికి తరలించడం లేదా శిశువిహార్‌కు చేర్చడంలో ఈమె ముందుంటారు. అనాథ పిల్లలకు దుస్తులు, ఇతర సామగ్రి అందిస్తుంటారు. ఇప్పటి వరకు సుమారు 23 మంది పిల్లలను అనాథాశ్రమంలో చేర్పించారు. 16 మంది శిశువులను శిశువిహార్‌కు చేర్చారు. వీరందరి బాగోగులు తరచూ తెలుసుకుంటారు. కల్యాణమస్తు కార్యక్రమం ద్వారా 26 మందికి ఆదర్శ వివాహం చేసి ఇంటి స్థలాలు ఇప్పించారు కూడా. 18 మంది బాల్య వివాహాలను అడ్డుకుని తల్లిదండ్రులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. అవగాహన సదస్సులు నిర్వహించారు. అనాథ ఆడపిల్లలు కనిపించగానే పోలీసులు సైతం కౌన్సెలింగ్ చేసి సులోచన ద్వారా అనాథాశ్రమానికి పంపించటం గమనార్హం.

అంగన్‌వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ మానుకోట ఐసీడీఎస్ శాఖ కార్యదర్శిగా పనిచేస్తూ ఆరేళ్లుగా సమస్యలపై ఉద్యమిస్తున్నారు. ‘మహిళలు చదువుకోవాలి. ధైర్యంగా ప్రతి విషయాన్ని ఎదుర్కోవాలి. పురుషునితో సమానంగా అన్ని రంగాల్లో రాణించాలి. సమాజానికి తగ్గట్టుగా మారాలి. ప్రత్యేక గుర్తింపు కోసం కృషి చేయూలి. సేవా కార్యక్రమంలోను మహిళలు ముందుండాలి. మదర్ థెరిస్సా నాకు ఆదర్శం’ అంటున్నారు సులోచన.
 
అభాగ్యులకు అవ్ము ప్రేవు
 
విధి వక్రించిన అభాగ్యులకు ఆమె అమ్మయ్యూరు. ఆలనాపాలన చూస్తున్నారు. తొమ్మిదేళ్లుగా అనాథ పిల్లలకు సేవ చేస్తూ వారిలో భరోసా నింపుతున్నారు అర్షనపెల్లి వినోద. నర్సంపేటలో ప్రవుుఖ వైద్యుడు అర్షనపుల్లి మోహన్‌రావు సంజీవని అనాథ ఆశ్రవుం నెలకొల్పారు. ఇందులో 40 వుంది అనాథ చిన్నారులకు వసతి కల్పిస్తున్నారు. మోహన్‌రావు భార్య వినోద ప్రతీ రోజు సకల సపర్యలు విద్యార్థులకు అందిస్తూ అవ్ములేదనే దిగులు దూరం చేస్తున్నారు. ఆ చిన్నారులు చెందకుండా కంటికి రెప్పలా కాపాడుతున్నారు. ఆర్థిక పరమైన ఇబ్బందులు లేకున్నా, భర్త వైద్య వృత్తిలో, అనాథ ఆశ్రవుం నిర్వహణ కార్యక్రవూల్లో బిజీగా ఉంటున్నా ఇల్లాలిగా పనులు చేసుకుంటూనే ఇటు ఆశ్రవుంలోని అనాథలకు అవ్ము ప్రేవును పంచుతూ ఆత్మ సంతృప్తి పొందుతున్నారు. ‘ఈ అనాథ
 చిన్నారులకు సేవ చేసే అవకాశం నాకు లభించడం దేవుడిచ్చిన వరం’ అంటుంటారు వినోద.      - నర్సంపేట
 
 మహిళా చట్టాల అమలులో చిత్తశుద్ధేది?

ధనసరి అనసూయ(సీతక్క)
 
వరంగల్ లీగల్ : బుల్లెట్ ద్వారానే రాజ్యాధికారం సాధ్యమని నమ్మిన సీపీఐఎంఎల్ జనశక్తి పార్టీలో తొలి మహిళా అజ్ఞాత నక్సలైట్ దళ నాయకురాలు, దక్షిణ భారతదేశంలో మొట్టమొదటి ఆదివాసి కోయ తెగ గిరిజన మహిళా న్యాయవాది, జిల్లాలో తొలి ఆదివాసి మహిళా ఎమ్మెల్యే ధనసరి అనసూయ అలియాస్ సీతక్క.   విభిన్న ప్రస్థానాల్లోని తన అనుభవాలను అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ‘సాక్షి’తో ఇలా పంచుకున్నారు. ‘సమానత్వానికి ప్రతీక స్త్రీ. పితృస్వామిక వ్యవస్థలో సామాజి, రాజకీయ ఆర్థిక రంగాల్లో వివక్ష కొనసాగుతోంది. కట్టుబాట్లు ఎదుర్కొని ముందుకొచ్చే మహిళలకు అవకాశాలు కల్పించి ప్రోత్సహించాలి.

స్త్రీ సమానత్వం, సాధికారిత సాధించాలంటే విధాన నిర్ణయాధికార వేదికల్లో,  స్త్రీల సమస్యల సబంధిత చట్టసభ కమిటీలు, సంక్షేమ పథకాల్లో వారికి భాగస్వామ్యం కల్పించాలి. రాష్ట్ర క్యాబినెట్‌లో స్త్రీలకు ప్రాతినిధ్యమే లేదు. ఇది దేనికి సంకేతం? అత్యాచారాలు వేధింపుల కేసుల విచారణై కోసంప్రత్యేక కోర్టులు ఏర్పాటు చేయాలి. న్యాయమూర్తులు, ప్రాసిక్యూషన్ ఆఫీసర్లు గా మహిళలనే నియమించాలి. స్త్రీల సమస్యలు సమాజ సమస్యలుగా పరిగణించాలి.    ప్రభుత్వపరంగా ప్రోత్సహిం చాలి’.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement