నిర్మాణ రంగ కార్మికులకు ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ
కేంద్ర కార్మిక మంత్రి దత్తాత్రేయ వెల్లడి
సాక్షి, హైదరాబాద్: నిర్మాణ రంగంలో పనిచేస్తున్న కార్మికులకు త్వరలో ఈఎస్‌ఐ, ఈపీఎఫ్‌ఓ సేవలు అందించనున్నట్లు కేంద్ర కార్మిక శాఖ మంత్రి బండారు దత్తాత్రేయ వెల్లడించారు. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడి వివరాలను రిజిస్టర్ చేస్తున్నట్లు చెప్పారు. ఢిల్లీలో ప్రత్యేకంగా ఈఎస్‌ఐ కార్పొరేషన్ సమావేశం నిర్వహించి ఉత్తర్వులు జారీ చేస్తామన్నారు. శనివారం ఈఎస్‌ఐసీ ప్రాంతీయ కార్యాలయంలో రాష్ట్ర హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డితో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. ‘కేంద్ర ప్రభుత్వం కొత్తగా స్ప్రీ (స్కీం ఫర్ ప్రమోటింగ్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎంప్లాయర్స్ అండ్ ఎంప్లాయిస్) కార్యక్రమాన్ని ప్రవేశపెట్టిం ది. ఇందులో భాగంగా ప్రతి కార్మికుడు, కంపెనీ వివరాలను రిజిస్ట్రేషన్ చేస్తున్నాం. ఇప్పటివరకు 2.31 లక్షల మంది పేర్లు రిజిస్టర్ చేశాం. వీరికి సం ఘటిత కార్మిక విభాగం కింద కార్మిక రాజ్య బీమా సంస్థ సేవలు, భవిష్య నిధి సేవలు అందుతాయి’ అని చెప్పారు. జాతీయ బాల కార్మిక ప్రాజెక్టు ఏర్పాటు కోసం రాష్ట్ర వ్యాప్తంగా పరిశీలన చేపట ్టనున్నట్లు దత్తాత్రేయ వివరించారు. బీడీ కార్మికు లను ఈఎస్‌ఐసీ పరిధి లోకి తీసుకొచ్చామన్నారు.
ప్రభుత్వం భూమిస్తే వెంటనే రూ.300 కోట్లు..
రాష్ట్రంలో మూడు ఈఎస్‌ఐసీ ఆస్పత్రులు ఏర్పాటు చేస్తామని, రాష్ట్ర ప్రభుత్వం భూమిని కేటాయిస్తే కేంద్రం నుంచి తక్షణమే రూ.300 కోట్లు విడుదల చేస్తామని దత్తాత్రేయ చెప్పారు. ఖమ్మంలో ఈపీఎఫ్‌ఓ ప్రాంతీయ కార్యాలయం, రామగుండం, కొత్తగూడెంలో ఉప ప్రాంతీయ కార్మిక రాజ్య బీమా కార్యాలయాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. హోం, కార్మిక శాఖ మంత్రి నాయిని నర్సింహారెడ్డి మాట్లాడుతూ.. అసంఘటిత రంగ కార్మికుల గుర్తింపుపై కమిటీ వేశామని, నివేదిక వచ్చిన తర్వాత ప్రభుత్వం చర్యలు తీసుకుంటుం దన్నారు. సమావేశంలో కార్మిక శాఖ కార్యదర్శి రజత్‌కుమార్, ఉపాధి కల్పన సంచాలకులు కే.వై.నాయక్, ఈఎస్‌ఐ సంచాలకులు దేవికారాణి తదితరులు పాల్గొన్నారు.