ప్రపంచంలో అగ్రగామిగా బీజేపీ.. | World In the Top as BJP party | Sakshi
Sakshi News home page

ప్రపంచంలో అగ్రగామిగా బీజేపీ..

Published Fri, Feb 13 2015 3:06 AM | Last Updated on Fri, Mar 29 2019 9:00 PM

ప్రపంచంలో అగ్రగామిగా బీజేపీ.. - Sakshi

ప్రపంచంలో అగ్రగామిగా బీజేపీ..

ఆదిలాబాద్ రిమ్స్ : ప్రపంచంలోనే అత్యధిక సభ్యత్వాలున్న పార్టీగా బీజేపీ త్వరలో అగ్రగామిగా నిలవబోతోందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి అన్నారు. భారతీయ జనతా పార్టీ జిల్లా కార్యవర్గ సమావేశాన్ని గురువారం ఆదిలాబాద్‌లోని ఎస్టీయూ భవన్‌లో నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా హాజరైన కిషన్‌రెడ్డిని ఆ పార్టీ నాయకులు పుష్పగుచ్చం, శాలువాతో సత్కరించారు. ఉదయం 9 గంటలకు పార్టీ కోర్‌కమిటీ సభ్యులతో, 10 గంటలకు పదాధికారులతో వేర్వేరుగా సమావేశాలు నిర్వహించారు.

పార్టీ బలోపేతం, సభ్య త్వ నమోదుపై చర్చించారు. అనంతరం జ్యోతి ప్రజ్వల న చేసిన కిషన్‌రెడ్డి జిల్లా కార్యవర్గ సమావేశాన్ని ప్రారంభించారు. సమావేశానికి హాజరైన పార్టీ సభ్యులకు ఆన్‌లైన్ సభ్యత్వంపై వివరించారు. ప్రపంచంలో చైనా క మ్యూనిస్టు పార్టీ ప్రస్తుతం 6కోట్ల సభ్యత్వాలతో మొద టి స్థానంలో ఉందని, త్వరలో బీజేపీ అధిగమించబోతోందన్నారు. ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 5.40 కోట్ల సభ్యత్వాలు పూర్తయ్యాయన్నారు. మొదటి దశలో రశీదులు, సంతకాల ద్వారా రాష్ట్రంలో 11లక్షల సభ్యత్వా లు నమోదు చేశామని తెలిపారు. రెండో దశలో ఆన్‌లైన్ ద్వారా ఇప్పటి వరకు 5 లక్షల సభ్యత్వాలు జరిగాయని, వీటిని మరో 15 లక్షల వరకు పెంచుతామన్నారు.

2015ను సంస్థాగత సంవత్సరంగా తీసుకున్నామని, గ్రామస్థాయి నుంచి సభ్యత్వం చేపట్టి 2016 నుంచి ప్రజల్లోకి వెళ్తామని పేర్కొన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కు ప్రత్యామ్నాయ శక్తిగా బీజేపీ ఎదుగుతుందని పేర్కొన్నారు. గ్రామ, మండల, బూత్ స్థాయిలో ఆన్‌లైన్ సభ్యత్వ నమోదు చేపట్టాలన్నారు. బూత్‌కు ఇద్దరు కో ఆర్డినేటర్‌లను నియమించి వర్క్‌షాప్ నిర్వహించాలని సూచించారు. వంద సభ్యత్వాలు చేయించిన వారికి పార్టీలో క్రియశీలక బాధ్యతలు అప్పగిస్తామన్నారు. సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు అయ్యన్నగారి భూమయ్య, జిల్లా ఇన్‌చార్జి మురళీధర్‌గౌడ్, బీజేపీ కిసాన్ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పాయల శంకర్, రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు రమాదేవి, రాష్ట్ర నాయకులు మధుసూదన్‌రెడ్డి, గోనె శ్యాంసుందర్, అల్లూరి నారాయణరెడ్డి, వెంకటేశ్‌గౌడ్, రావుల రాంనాథ్, సుహాసినిరెడ్డి, శ్రీరాంనాయక్, తదితరులు పాల్గొన్నారు.
 
కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లుగా..
తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ తీరు కొండను తవ్వి.. ఎలుకను పట్టినట్లుగా ఉందని కిషన్‌రెడ్డి ఎద్దేవా చేశారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అనాలోచిత నిర్ణయాలతో పథకాలపై స్పష్టత ఇవ్వకుండా ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తోందని పేర్కొన్నారు. గురువారం జిల్లా పర్యటనకు వచ్చిన ఆయన జిల్లా కేంద్రంలోని ఎస్టీయూ భవన్‌లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాష్ట్రంలో అధికార పార్టీ పనితీరు ప్రచారానికే పరిమితమవుతోందని, చేతల్లో మాత్రం చూపించడం లేదన్నారు. ప్రభుత్వ తీరుతో ఎంతో మంది పింఛన్ల కోసం ఆత్మహత్యలు, గుండెపోటుతో మృతి చెందుతున్నారని గుర్తు చేశారు.

మరో రెండు నెలల్లో ఈ విద్యా సంవత్సరం పూర్తి కావస్తున్న రీయింబర్స్‌మెంట్ నిధులు విడుదల చేయకపోవడం విడ్డూరమన్నారు. తెలంగాణ కోసం ఉద్యమాలు చేసిన విద్యార్థులను ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేస్తోందన్నారు. ఏడాదికి 25 శాతం రైతు రుణ మాఫీ చేస్తే.. అవి కేవలం వడ్డికి మాత్రమే సరిపోతుందని, పూర్తి స్థాయిలో రుణ మాఫీ ఎప్పుడవుతుందని ప్రశ్నించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లకు విద్యుత్, నీళ్ల పంపిణీ విషయంలో చంద్రబాబు స్పష్టత ఇవ్వాలని, ఎలాంటి పక్షపాతం లేకుండా రెండు రాష్ట్రాలకు న్యాయం జరిగేలా చూడాలన్నారు.
 
ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ..
తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల బరిలో బీజేపీ పోటీ చేస్తుందని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి చెప్పారు. వరంగల్, ఖమ్మం, నల్గొండ ఎమ్మెల్సీ స్థానానికి వై.రాంమోహన్, హైదరాబాద్, రంగారెడ్డి, మహబూబ్‌నగర్ జిల్లాల ఎమ్మెల్సీ స్థానానికి రాంచంద్రరావును ప్రకటించినట్లు తెలిపారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీతో పొత్తు విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement