ఉప్మాలో పురుగులు | worms in upma hostel students dharna | Sakshi
Sakshi News home page

ఉప్మాలో పురుగులు

Published Fri, Dec 18 2015 2:03 AM | Last Updated on Sat, Sep 15 2018 3:07 PM

ఉప్మాలో పురుగులు - Sakshi

ఉప్మాలో పురుగులు

  - నిరసన వ్యక్తం చేసిన విద్యార్థులు
  - హాస్టల్‌ను సందర్శించిన తహశీల్దార్

 జహీరాబాద్ టౌన్:
విద్యార్థులకు ఉదయం వడ్డించిన ఉప్మాలో పురుగులు వచ్చిన సంఘటన గురువారం స్థానిక ఎస్సీ హాస్టల్‌లో జరిగింది. ఉప్మాలో పురుగులు రావడంతో ఎస్సీ హాస్టల్ విద్యార్థులు గురువారం నిరసన వ్యక్తం చేశారు.  ఈ విషయం తెలుసుకున్న గిరిజన సంఘం మండల అధ్యక్షుడు ఎస్పీ తుకారం, ప్రధాన కార్యదర్శి రాజు పవార్, జిల్లా ఉపాధ్యక్షుడు జైసింగ్ రాథోడ్, సామాజిక సేవా సమితి అధ్యక్షుడు సతీష్ చౌహన్ తదితరులు వసతి గృహానికి వచ్చి వార్డెన్ శ్రీనివాస్‌ను నిలదీసి, నిర్లక్ష్యంపై మండిపడ్డారు.అనంతరం తహశీల్దార్ దశరథ్ సింగ్ వసతి గృహానికి వచ్చి  పురుగులతో ఉన్న ఉప్మాను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన వార్డెన్‌తో పాటు వంట మనిషిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ జిల్లా అధికారులకు ఫిర్యాదు చేస్తానని హెచ్చరించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement