వారి తీరు కోతుల కంటే హీనం | Worse than the nature of the apes | Sakshi
Sakshi News home page

వారి తీరు కోతుల కంటే హీనం

Published Mon, Mar 9 2015 1:54 AM | Last Updated on Tue, Oct 30 2018 7:30 PM

వారి తీరు కోతుల కంటే హీనం - Sakshi

వారి తీరు కోతుల కంటే హీనం

తొర్రూరు: అసెంబ్లీలో టీడీపీ ఎమ్మెల్యేలు వ్యవహరించిన తీరు కోతుల కంటే హీనంగా ఉందని తెలంగాణ డిప్యూటీ సీఎం కడియం శ్రీహరి విమర్శించారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో తొర్రూరులో జరిగిన సభలో ఆయన మాట్లాడారు. కేసీఆర్ నాయకత్వంలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేసే విధంగా టీఆర్‌ఎస్ పాలన సాగుతోందన్నారు. ఇంకా ప్రజా సమస్యలు ఉంటే చర్చించాల్సిన సభలో ఏం మాట్లాడాలో తెలి యక టీడీపీ సభ్యులు బల్లలు ఎక్కి, మైక్‌లు విరగ్గొట్టి రౌడీల్లాగా వ్యవహరించడం సిగ్గుచేటన్నారు. కేవలం ఉనికిని కాపాడుకునేందుకే దొంగచాటున తెలంగాణ టీడీపీ నాయకులు బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థికి మద్దతు తెలుపుతున్నారన్నారు.

బీజేపీకే ఓటు వేస్తే మళ్లీ ఆంధ్ర పార్టీ అయిన చంద్రబాబుకు ఓటు వేసినట్లేనని పునరుద్ఘాటించారు. రాష్ట్ర భారీ నీటిపారుదలశాఖ మంత్రి తన్నీరు హరీశ్‌రావు మాట్లాడుతూ బీజేపీ ముసుగులో వస్తున్న పక్క రాష్ట్ర పార్టీని ఎమ్మెల్సీ ఎన్నికల్లో తరిమికొట్టాలని పిలుపునిచ్చా రు. బంగారు తెలంగాణ కావాలంటే కేసీఆర్ నాయకత్వాన్ని బలపరుస్తూ తెలంగాణ ఇంటి పార్టీ అయిన టీఆర్‌ఎస్ అభ్యర్థికి మొదటి ప్రాధాన్యత ఓటు వేసి గెలిపించాలని కోరారు. పొరపాటున బీజేపీ అభ్యర్థికి డిపాజిట్ దక్కితే తెలంగాణలో కేసీఆర్ పని అయిపోయిందంటూ విషప్రచారం చేసే ప్రమాదం ఉందన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement