భూమేశ్ మృతదేహం
పాపన్నపేట: ప్రేమించిన యువతి మరణాన్ని భరించలేక ఓ యువకుడు బలవన్మరణానికి పాల్పడ్డాడు. మెదక్ జిల్లా పాపన్నపేట మండలం తుమ్మలపల్లిలో జరిగింది. కొత్తపల్లికి చెందిన భూమేశ్ (23)కు తల్లిదండ్రులు లేరు. ఎంబీఏ వరకు చదివిన అతడు అదే గ్రామానికి చెందిన డిగ్రీ విద్యార్థినిని ప్రేమించాడు. అయితే ఫిబ్రవరి 27న ప్రేమించిన యువతి ఆత్మహత్య చేసుకుంది.
అమ్మాయి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు విచారణ చేపట్టిన పోలీసులు యువతి సెల్‌ఫోన్ కాల్ లిస్టులో ఎక్కువ కాల్స్ భూమేశ్‌కు వెళ్లినట్లు గుర్తించారు. అతడికి పోలీసులు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో సోమవారం సాయంత్రం తుమ్మలపల్లిలోని అక్క హిమబిందు ఇంటికి వెళ్లిన భూమేశ్, ఇంట్లో ఉరేసుకున్నాడు.