
సాక్షి పాల్వంచ: వివాహం నిశ్చయమైంది.. మరో రెండు నెలల్లో పెళ్లి జరగాల్సి ఉంది. కానీ ఇంతలో అనుకోని రీతిలో మృత్యువు అతడిని కబళించింది. ఈ విషాద ఘటన భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలో చోటుచేసుకుంది. వివరాలివి.. జిల్లాలోని పాల్వంచ మండలం తోగ్గూడెం వద్ద మిషన్ భగీరథ పనులు జరుగుతున్నాయి. అదే గ్రామానికి చెందిన జర్పుల మోహన్ సింగ్ వెల్డర్‌గా పనిచేస్తున్నాడు.
వెల్డింగ్ పనులు చేస్తున్న సమయంలో శనివారం మధ్యాహ్నం తన చేతిలో ఉన్న ఇనుప రాడ్‌కు విద్యుత్ వైర్‌కు తగలడంతో షాక్ తగిలి మరణించాడు. కాగా, మరో రెండు నెలల్లో పెళ్లి పీటలెక్కాల్సిన వాడు ఇలా విగతజీవిగా మారడంతో ఆ కుటుంబంలో విషాదఛాయలుల అలుముకున్నాయి.