సాక్షి, హైదరాబాద్: నూతన సాంకేతికతను వినియోగించుకోవడం ద్వారా మిషన్ భగీరథ పనులను సమర్థవంతంగా చేస్తున్నారని కేంద్ర తాగునీరు, పారిశుద్ధ్య శాఖ సహాయ కార్యదర్శి ఆసిఫ్ కె.యూసుఫ్ అన్నారు. హైదరాబాద్‌లోని ఆర్‌డబ్ల్యూయస్ కార్యాలయంలో ఈ.ఎన్.సి సురేందర్ రెడ్డితో గురువారం ఆయన సమావేశమయ్యారు. మిషన్ భగీరథ వెబ్‌సైట్, మొబైల్ యాప్ ద్వారా పనుల పర్యవేక్షణను ఆసిఫ్ పరిశీలించారు.
దేశంలోని మారుమూల ప్రాంతాల్లో తాగునీటి çసరఫరా కోసం కేంద్ర ప్రభుత్వం ప్రారంభిస్తున్న స్వజల్ స్కీం పథకానికి మిషన్ భగీరథ తరహా పర్యవేక్షణ విధానాన్ని కేంద్రం అనుసరించాలనుకుంటోంది. ఈ నేపథ్యంలో మిషన్ భగీరథలో ఉపయోగిస్తున్న సాంకేతికతను తెలుసుకునేందుకు ఆయన హైదరాబాద్‌కు వచ్చారు. ఈ సందర్భంగా మిషన్ భగీరథ పనుల పురోగతిని ఫొటోల రూపంలో అధి కారులు చూపించారు. డ్యాష్ బోర్డ్ సహాయంతో పనులను ఎలా పర్యవేక్షిస్తున్నది అధికారులను ఆసిఫ్ అడిగి తెలుసుకున్నారు. యాప్‌తో పైప్ లైన్ పనుల పురోగతిని తెలుసుకునే పద్ధతిని వివరించారు.
Comments
Please login to add a commentAdd a comment