దేవరకద్ర రూరల్ (మహబూబ్‌నగర్) : పీజీ చదువుతూ కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు ఉద్యోగం చేయాలనుకున్న ఓ వ్యక్తి రైలు పట్టాలపై శవమై కనిపించాడు. మహబూబ్‌నగర్ జిల్లా ఆత్మకూరు మండలం మూలమల్ల గ్రామానికి చెందిన వడ్ల రామకృష్ణ (23) డిగ్రీ పూర్తి చేశాడు. మహబూబ్‌నగర్‌లో పీజీ చదువుతున్నాడు. ఉద్యోగం కోసమని సర్టిఫికెట్లు జిరాక్స్‌లు తీసుకుని ఈ నెల 3న ఇంటి నుంచి బయల్దేరాడు. కాగా శనివారం దేవరకద్ర సమీపంలో రైలు పట్టాలపై మృతి చెంది ఉండగా గుర్తించారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు.