వైఎస్ఆర్ విగ్రహాన్ని ఆవిష్కరించిన వైఎస్ షర్మిల
ఇబ్రహీంపట్నం : పరామర్శ యాత్రకు బయల్దేరిన వైఎస్ షర్మిలకు రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో ఘన స్వాగతం లభించింది. ఆమె సోమవారం ఉదయం హైదరాబాద్ నుంచి మహబూబ్‌నగర్ జిల్లా పరామర్శ యాత్రకు బయలుదేరిన విషయం తెలిసిందే. ఇబ్రహీంపట్నంలో అభిమానులు ఏర్పాటు చేసుకున్న మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని షర్మిల ఆవిష్కరించారు. పూలమాల వేసి నివాళులర్పించారు. షర్మిల రాకతో ఆ ప్రాంతమంతా నినాదాలతో దద్దరిల్లింది.