రైతు ఆత్మహత్యలకు నిరనసగా వైఎస్సార్ సీపీ ఆందోళన | YSRCP protest against farmer suicides due to trs failure in karimnagar | Sakshi
Sakshi News home page

రైతు ఆత్మహత్యలకు నిరనసగా వైఎస్సార్ సీపీ ఆందోళన

Published Fri, Sep 18 2015 2:51 PM | Last Updated on Mon, Oct 1 2018 2:36 PM

రైతు ఆత్మహత్యలకు నిరనసగా వైఎస్సార్ సీపీ ఆందోళన - Sakshi

రైతు ఆత్మహత్యలకు నిరనసగా వైఎస్సార్ సీపీ ఆందోళన

కరీంనగర్: రైతుల ఆత్మహత్యలను అరికట్టడంలో ప్రభుత్వ వైఫల్యాన్ని నిరసిస్తూ వైఎస్సార్ సీసీ ఆధ్వర్యంలో ధర్నా జరిగింది. కరీంనగర్ జిల్లా కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం రైతులతో ర్యాలీగా తరలివెళ్లి కలెక్టరేట్ వద్ద ధర్నాకు దిగారు. అన్నదాతలను సర్కారు ఆదుకోవాలని ఈ సందర్భంగా డిమాండ్ చేశారు. ఆత్మహత్యకు చేసుకున్న కుటుంబాలకు ప్రత్యేక సాయం అందజేయాలని ఆ పార్టీ నేతలు కోరారు. ఈ ధర్నాలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నల్లా సూర్యప్రకాశ్, జిల్లా పార్టీ అధ్యక్షుడు సింగిరెడ్డి భాస్కర్‌రెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు బోయినపల్లి శ్రీనివాసరావు, అక్కినపల్లి కుమార్ తదితరులు ఈ నిరసనలో పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement