కార్పొరేషన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన | ysrcp protests against merge villages in karimnagar corporation | Sakshi
Sakshi News home page

కార్పొరేషన్‌లో విలీనాన్ని వ్యతిరేకిస్తూ ఆందోళన

Published Thu, Feb 8 2018 5:53 PM | Last Updated on Tue, May 29 2018 4:40 PM

ysrcp protests against merge villages in karimnagar corporation - Sakshi

కలెక్టరేట్‌ ఎదుట ధర్నా చేస్తున్న నాయకులు

మంకమ్మతోట : కరీంనగర్‌ కార్పొరేషన్‌లో గ్రామాలను విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్‌సీపీ ఆధ్వర్యంలో నగరంలోని కలెక్టరేట్‌ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా అధ్యక్షుడు డాక్టర్‌ కె.నగేశ్‌ మాట్లాడుతూ ప్రజాభిప్రాయం తీసుకోకుండా ప్రజాభీష్టానికి విరుద్ధంగా నగర కార్పొరేషన్‌లో 11 గ్రామాలను విలీనం చేయడాన్ని ఖండించారు. ప్రభుత్వం బలవంతంగా విలీనం చేస్తే ప్రజల మద్దతుతో ప్రతిఘటిస్తామని హెచ్చరించారు. విలీనం చేస్తున్న ఈ గ్రామాల్లో వేలాదిమంది ప్రజలు, రైతులు కూలీలుగా జీవనం సాగిస్తున్నారన్నారు. ప్రజల నిర్ణయం తీసుకోకుండా బలవంతంగా విలీనం చేస్తే.. వారు వ్యవసాయం కోల్పోయి జీవనోపాధికి దూరమయ్యే ప్రమాదం ఉందని పేర్కొన్నారు. పన్నుల భారం పడి ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటారని, దాదాపు 5కిలోమీటర్ల దూరం వచ్చి పనులు చేయించుకోవాల్సి వస్తుందని అన్నారు.

గతంలో కట్టరాంపూర్, కోతిరాంపూర్, రాంనగర్‌ గ్రామాలు విలీనం జరిగి 15 సంవత్సరాలు గడుస్తున్నా.. ఇప్పటికీ అభివృద్ధికి నోచుకోలేదని విమర్శించారు. రాష్ట్ర నాయకుడు అక్కెనపెల్లి కుమార్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు బోగె పద్మ, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి వరాల శ్రీనివాస్, యువత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎడ్ల సురేందర్‌రెడ్డి, బీసీ సెల్‌ జిల్లా అధ్యక్షుడు బండమీది అంజయ్య, జిల్లా అధికార ప్రతినిధులు ఎండీ షాహెన్‌షా, కోట రాజ్‌కుమార్, యూత్‌ పట్టణ అధ్యక్షుడు సాధిక బలాల, యువత జిల్లా కార్యదర్శి ఎండీ ఫెరోజ్, పార్టీ ఆఫీస్‌ ఇన్‌చార్జి ఎండీ రహీమోద్దీన్, మాజీ రాష్ట్ర కార్యదర్శి సొల్లు అజయ్‌వర్మ, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు వన్నారం అక్షయ్‌యాదవ్, విద్యార్థి విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి దేవునూరి శ్రీనివాస్, విద్యార్థి విభాగం జిల్లా కార్యదర్శి ఆకోజు విఠలాచారి, జిల్లా కార్యదర్శి జంగిలి రవిచందర్, పట్టణ ప్రధాన కార్యదర్శి సుంకె ఆనంద్, కార్మిక విభాగం పట్టణ అధ్యక్షుడు ఇప్పనపెల్లి శేఖర్, బీసీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు కడార్ల నాగార్జునాచారి, క్రిస్టియన్‌ మైనార్టీ యూత్‌ పట్టణ అధ్యక్షుడు జి.నికోలస్, మైనార్టీ సెల్‌ పట్టణ అధ్యక్షుడు యూనస్, సోషల్‌ మీడియా ఇన్‌చార్జి ఎండీ వలీయోద్దీన్, జిల్లా ప్రధాన కార్యదర్శి రామకృష్ణారెడ్డి, నాయకులు అస్లమ్, తిరుపతి, జయశ్రీ పాల్గొన్నారు.
 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement