కరాచీ : పాకిస్థాన్ నౌకాశ్రయ నగరం కరాచీలో మంగళవారం దారుణం చోటు చేసుకుంది. నగరంలోని గులిస్థాన్ -ఐ- జవహర్ ప్రాంతంలోని మురికివాడపై కొండ చరియలు విరిగిపడ్డాయి. ఈ ఘటనలో 13 మంది మరణించారని కరాచీ కమిషనర్ షోయిబ్ సిద్ధిఖి వెల్లడించారు. ఈ ఘటన ఈ రోజు తెల్లవారుజామున 2.00 గంటల ప్రాంతంలో చోటు చేసుకుందని తెలిపారు. ఈ ఘటనపై సమాచారం అందిన వెంటనే రెస్క్యూ టీం ఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టి... శిథిలాల కింద మృతదేహలను వెలికి తీసినట్లు చెప్పారు.
అయితే మృతల్లో ఏడుగురు చిన్నారులు ఉన్నారని పేర్కొన్నారు. మృతులంతా పంజాబ్ రాష్ట్రంలోని బహ్వాల్ పూర్, రేహ్మాయార్ ఖాన్ జిల్లాల్లోకు చెందిన వారని చెప్పరు. మృతదేహాలను స్వస్థలాలకు తరలించినట్లు చెప్పారు. ఈ ఘటనపై పాక్ ప్రధాని నవాజ్ షరీఫ్ తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. మృతుల కుటుంబానికి ఆయన ప్రగాఢ సంతాపం తెలిపారు.