
క్రూర మృగాలకు 63 మంది బలి
రాయ్పూర్: ఒక్కరూ ఇద్దరూ కాదు అడవులకు సమీపంలో ఉండే గ్రామాలపై దాడిసిన క్రూర మృగాలు ఏకంగా 63 మందిని పొట్టనపెట్టుకున్నాయి. ఛత్తీస్ గఢ్ రాష్ట్ర వ్యాప్తంగా 2014- 2015 సంవత్సరంలో మృగాల దాడిలో చనిపోయినవారి సంఖ్యను రమణ్ సింగ్ ప్రభుత్వం బుధవారం అసెంబ్లీలో ప్రకటించింది. ఈ మరణాల్లో ఎక్కువ శాతం దట్టమైన అడవులున్న ఉత్తర ఛత్తీస్గఢ్లోనే సంభవించడం గమనార్హం.
క్రూర మృగాల దాడులను ఏ విధంగా నివారిస్తున్నారన్న ప్రతిపక్ష కాంగ్రెస్ సభ్యుడి ప్రశ్నకు అటవీ శాఖ మంత్రి మహేశ్ గోగ్డా బదులిస్తూ ప్రజలను అప్పమత్తులను చేసేందకు సర్కార్ చేపట్టిన చర్యలను వివరించారు. ఏనుగులే ఎక్కువ సంఖ్యలో గ్రామాలపై దాడులకు పాల్పడుతున్న నేపథ్యంలో వాటిని బెదరగొట్టేడం ఎలాగో ప్రజలకు తర్ఫీదునిస్తున్నట్లు చెప్పారు. ఇందుకోసం ఆయా గ్రామాల్లో సుశిక్షితులతో శిక్షణా కేంద్రాలు ఏర్పాటుచేశామన్నారు.