దీపావళి దగ్గరపడుతున్న కొద్దీ ఇటు షాపులతో పాటు అటు ఆన్‌లైన్లో ఈ-కామర్స్ సైట్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో పడ్డాయి.
న్యూఢిల్లీ: దీపావళి దగ్గరపడుతున్న కొద్దీ ఇటు షాపులతో పాటు అటు ఆన్‌లైన్లో ఈ-కామర్స్ సైట్లు కూడా కొనుగోలుదారులను ఆకర్షించే ప్రయత్నాల్లో పడ్డాయి. డిస్కౌంట్లు, ఉచిత బహుమతులు తదితర ఆఫర్లతో ఊదరగొడుతున్నాయి.
30-70 శాతం దాకా డిస్కౌంట్లు ఇస్తామంటూ ఊరిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్, శ్నాప్‌డీల్, జబాంగ్, అమెజాన్ ఇండియా వంటి పలు ఇ-టైలింగ్ సైట్లు ఇందులో ఉన్నాయి. దేశీయంగా ఆన్‌లైన్ రిటైలింగ్ వ్యాపారం ఏటా సుమారు 600 మిలియన్ డాలర్లు ఉంటుంది. ఇది 2020 నాటికి 70 బిలియన్ డాలర్లకు చేరొచ్చని టెక్నోపాక్ అడ్వైజర్స్ అనే కన్సల్టెన్సీ సంస్థ అంచనా వేసింది. ఇక ట్రావెల్ సైట్స్ సహా మొత్తం ఈ-కామర్స్ మార్కెట్‌ను గానీ లెక్కేస్తే ప్రస్తుతం ఏటా 10 బిలియన్ డాలర్లుగా.. ఉండగా 2020 నాటికి 200 బిలియన్ డాలర్లకు పెరగగలదని అంచనా.