బడ్జెట్‌తో సరిపెట్టాలి అద్వానీ | Advani says, Telangana bill be kept on hold, vote-on-account be passed | Sakshi
Sakshi News home page

బడ్జెట్‌తో సరిపెట్టాలి అద్వానీ

Published Fri, Feb 14 2014 3:41 AM | Last Updated on Sat, Aug 18 2018 4:13 PM

బడ్జెట్‌తో సరిపెట్టాలి అద్వానీ - Sakshi

బడ్జెట్‌తో సరిపెట్టాలి అద్వానీ

న్యూఢిల్లీ: లోక్‌సభలో గురువారం చోటుచేసుకున్న కనీవినీ ఎరుగని సంఘటనలు విచారకరమని, పార్లమెంటు ప్రతిష్టకే మచ్చ అని బీజేపీ అగ్రనేత ఎల్‌కే అద్వానీ ఆవేదన వెలిబుచ్చారు. దీనికి పూర్తి బాధ్యత కాంగ్రెస్‌దేనని ఆరోపించారు. సభ్యులను సస్పెండ్ చేసో, లేదంటే బహిష్కరించైనా ఎట్టి పరిస్థితుల్లోనూ తెలంగాణ బిల్లును ఆమోదించుకోవాలని కాంగ్రెస్ మూర్ఖంగా వ్యవహరిస్తోందంటూ దుమ్మెత్తిపోశారు. బిల్లును ఆమోదించుకునే పద్ధతి ఇది కానే కాదన్నారు. ప్రస్తుత గందరగోళ పరిస్థితుల్లో పార్లమెంటులో ఓటాన్ అకౌంట్ బడ్జెట్ మినహా మరే బిల్లునూ చేపట్టరాదని డిమాండ్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement