హైకోర్టు ఆదేశాలతో కదిలిన సీఐడీ
సాక్షి ప్రతినిధి, విజయవాడ: అగ్రిగోల్డ్ చైర్మన్ అవ్వాసు వెంకటేశ్వరావు, ఆయన సోదరుడు కుమార్‌లను సీఐడీ పోలీసులు హైదరాబాద్‌లో గురువారం రాత్రి అరెస్టు చేశారు. ప్రజల నుంచి వసూలు చేసిన డిపాజిట్లను తిరిగి సకాలంలో చెల్లించకపోవడంతో పలు జిల్లాల్లో బాధితులు పోలీసు స్టేషన్‌లలో కేసులుపెట్టారు. దర్యాప్తు బాధ్యతను ప్రభుత్వం సీఐడీకి అప్పగించింది. ఈ కేసు హైకోర్టులో విచారణలో ఉంది. అప్పులకు సరిపడ ఆస్తులు ఉన్నట్లు యాజమాన్యం చెబుతున్నా, డిపాజిట్‌దారులకు డబ్బులు ఇవ్వలేకపోవడంతో అగ్రిగోల్డ్ సంస్థ డిఫాల్టర్‌గా నిలిచింది.
దీంతో కోర్టు నేరుగా జోక్యం చేసుకోవాల్సి వచ్చింది. తప్పు చేసిన వారు కళ్లముందే ఉన్నా ఎందుకు అరెస్టు చేయడం లేదని పోలీసులను కోర్టు నిలదీసింది. దీంతో అగ్రిగోల్డ్ సంస్థ చైర్మన్‌తో పాటు ఒక డెరైక్టర్‌ను అరెస్టు చేసినట్లు సీఐడీ అడిషనల్ డీజీపీ ద్వారకా తిరుమలరావు ‘సాక్షి’కి చెప్పారు.
అగ్రిగోల్డ్ చైర్మన్ అరెస్టు
Published Fri, Feb 12 2016 3:19 AM | Last Updated on Fri, Aug 31 2018 8:53 PM
Advertisement