హైదరాబాద్ : అగ్రిగోల్డ్ కేసుకు సంబంధించి సీఐడీ ద్వారానే ఆస్తుల అమ్మకం జరపాలని హైకోర్టు మరోసారి స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీలోగా ఆస్తుల తొలిదశ వివరాలను సీల్డ్ కవర్‌లో ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. విజయవాడలో ఉన్న ఏడు ఆస్తులు అమ్మాలని హైకోర్టు సూచనలు చేసింది.
19న ఓపెన్ బిడ్డింగ్ చేపట్టాలని...ఆస్తుల మార్కెట్ విలువను 21న కోర్టుకు సమర్పించి, 28న పత్రికలో ప్రకటన ఇవ్వాలని న్యాయస్థానం ఆదేశించింది. మరోవైపు అగ్రిగోల్డ్ యాజమాన్యం రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర ఆరోపణలు చేసింది. హాయ్‌ల్యాండ్‌పై కొంతమంది ప్రభుత్వ పెద్దలు కన్నేశారని, సీఐడీ ద్వారా కాజేయాలని ప్రయత్నించారని ఆరోపించింది. హాయ్‌లాండ్‌ను అమ్మకుండానే డబ్బులు చెల్లిస్తామని అగ్రిగోల్డ్ యాజమాన్యం తెలిపింది.