బాండ్ల ద్వారా ఎయిర్‌టెల్ బిలియన్ డాలర్ల సమీకరణ
న్యూఢిల్లీ : టెలికం దిగ్గజం భారతీ ఎయిర్‌టెల్ పదేళ్ల కాల పరిమితి బాండ్ల జారీ ద్వారా అంతర్జాతీయ ఇన్వెస్టర్ల నుంచి 1 బిలియన్ డాలర్లు సమీకరించింది. ఈ నిధులను పెట్టుబడి వ్యయాల కోసం వినియోగించనుంది. 66 శాతం బాండ్లను అమెరికా ఇన్వెస్టర్లకు, 18 శాతాన్ని యూరప్, 16 శాతాన్ని ఆసియా ఇన్వెస్టర్లకు కేటాయించినట్లు ఎయిర్‌టెల్ తెలిపింది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ఒక దేశీ ప్రైవేట్ కంపెనీ.. బాండ్ల జారీ ద్వారా ఇంత పెద్ద మొత్తాన్ని సమీకరించడం ఇదే ప్రథమం. ఎయిర్‌టెల్ గతేడాది డెట్ మార్కెట్ నుంచి 2.5 బిలియన్ డాలర్లు సమీకరించింది.