షాకింగ్‌ వీడియోను షేర్‌ చేసిన టాప్‌ హీరో! | Akshay Kumar Tweets Video of Cop Saving Woman Who Fell Off Moving Train | Sakshi
Sakshi News home page

షాకింగ్‌ వీడియోను షేర్‌ చేసిన టాప్‌ హీరో!

Published Mon, Sep 26 2016 6:08 PM | Last Updated on Fri, Mar 22 2019 5:33 PM

షాకింగ్‌ వీడియోను షేర్‌ చేసిన టాప్‌ హీరో! - Sakshi

షాకింగ్‌ వీడియోను షేర్‌ చేసిన టాప్‌ హీరో!

ముంబై: బాలీవుడ్‌ సూపర్‌ స్టార్‌ అక్షయ్‌కుమార్‌ సామాజిక విషయాల్లోనూ చురుగ్గా ఉంటారు. తాజాగా ఆయన సోషల్‌ మీడియాలో ఓ షాకింగ్‌ వీడియో పోస్టు చేశారు. ముంబై రైల్వే స్టేషన్‌లో నడుస్తున్న రైలు నుంచి దిగుతూ  ఓ మహిళ అదుపుతప్పి పడిపోయింది. రైలు కిందకు వెళ్లిపోతున్న ఆమెను అక్కడే ఉన్న ఓ కానిస్టేబుల్‌ చురుగ్గా స్పందించి కాపాడాడు. వెంటనే ఆమెను ఇటువైపు లాక్కొచ్చి ప్రాణాలు నిలబెట్టాడు. ఆ కానిస్టేబుల్‌ సమయస్ఫూర్తిని అక్షయ్‌కుమార్‌ కొనియాడుతూ ట్వీట్‌ చేశారు.

'ఈ వీడియో చూసి తన గుండెలు ఆగినంత పనైంది. సమయస్ఫూర్తితో వ్యవహరించిన లోనావాలా పోలీస్‌ స్టేషన్‌కు చెందిన కానిస్టేబుల్‌ పవన్‌ తాయ్‌డేకు సెల్యూట్‌' అంటూ అక్షయ్‌ పేర్కొన్నాడు. 'పోలీసులు నిజమైన హీరోలు అని నేను గతంలో చెప్పాను. ఇప్పుడు చెప్తున్నాను' అని వారి సేవల్ని కొనియాడారు. నడుస్తున్న రైలు నుంచి మహిళ పడిపోయిన ఈ వీడియోలో ఓ వ్యక్తి కూడా ప్లాట్‌ఫామ్‌ మీద పడిపోవడం గమనించవచ్చు. 'రుస్తుం'తో మరో ఘనవిజయాన్ని తన ఖాతాలో వేసుకున్న అక్షయ్‌కుమార్‌ త్వరలో 'జాలీ ఎల్‌ఎల్‌బీ 2', 'రోబో-2' సినిమాలతో రానున్నాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement