పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే | Pawan Kalyan to be seen for 25 minutes in 'Gopala Gopala' | Sakshi
Sakshi News home page

పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే

Published Tue, Jul 22 2014 12:39 PM | Last Updated on Tue, May 28 2019 10:05 AM

పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే - Sakshi

పవన్ కల్యాణ్ పాత్ర 25 నిముషాలే

హైదరాబాద్: తన దర్శకత్వంలో తాజాగా తెరకెక్కుతున్న గోపాల గోపాల చిత్రంలో పవర్ స్టార్ పవన్ కల్యాణ్ కేవలం 25 నిముషాలు మాత్రమే కనిపిస్తారని ఆ చిత్ర దర్శకుడు కిషోర్ కుమార్ వెల్లడించారు. మంగళవారం హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ... తాను పవన్ కల్యాణ్కి వీరాభిమానినని చెప్పారు. తాను దర్శకత్వంలో రూపొందుతున్న చిత్రంలో పవన్ కల్యాణ్ నటించడం ఆనందంగా ఉందని తెలిపారు. తన అభిమాన నటుడు పవన్ కల్యాణ్పై షూటింగ్ సోమవారం నుంచి ప్రారంభించినట్లు చెప్పారు. హిందీలో నిర్మితమైన ఓ మై గాడ్ చిత్రాన్ని తెలుగులో గోపాల గోపాలగా నిర్మిస్తున్న విషయాన్ని ఆయన ఈ సందర్బంగా గుర్తు చేశారు.

 

ఓ మై గాడ్ చిత్రంలోని అక్షయ్ కుమార్ పోషించిన పాత్రను పవన్ కల్యాణ్ పోషిస్తున్నారని చెప్పారు. గోపాల గోపాల చిత్ర హీరో వెంకటేశ్, పవన్ కల్యాణ్ల మధ్య చిత్రీకరిస్తున్న సన్నివేశాలు ప్రేక్షకులను అలరిస్తాయన అన్నారు. చిత్రంలోని పవన్, వెంకటేశ్ల డైలాగ్లు ప్రేక్షకుల హృదయాలు దోచుకుంటాయని వెల్లడించారు. 2015 సంక్రాంతి పండగ నాటికి ఈ గోపాల గోపాల చిత్రం విడుదలవుతుందని కిషోర్ కుమార్ తెలిపారు. ఈ చిత్రంలో శ్రియా, మిథున్ చక్రవర్తి, మురళి శర్మలు ముఖ్య పాత్రలు పోషిస్తున్నారని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement