నేను కాదు.. నా సినిమానే మాట్లాడుతుంది: బన్నీ | allu arjun comment on DJ movie | Sakshi
Sakshi News home page

నేను కాదు.. నా సినిమానే మాట్లాడుతుంది: బన్నీ

Published Wed, Jun 21 2017 7:14 PM | Last Updated on Tue, Sep 5 2017 2:08 PM

allu arjun comment on DJ movie

తిరుచానూరు : ‘దువ్వాడ జగన్నాథం (డీజే)’  సినిమా విడుదల కోసం తాను కూడా ప్రేక్షకుడిలాగే ఎదురుచూస్తున్నానని యువ హీరో అల్లు అర్జున్‌ అన్నారు. తాను ఇప్పుడేమీ మాట్లాడేది లేదనీ, రెండ్రోజుల్లో సినిమానే అన్నీ మాట్లాడేస్తుందని ఆయన నవ్వుతూ చెప్పారు.

అల్లు అర్జున్, పూజా హెగ్డేలు జంటగా నటించిన దువ్వాడ జగన్నాథం చిత్రం ఈ నెల 23న విడుదల కానుంది. ఈ చిత్ర యూనిట్‌ బుధవారం ఉదయం తిరుమల శ్రీవారిని దర్శించుకుంది. అనంతరం నిర్మాత దిల్‌రాజు, దర్శకుడు హరీశ్‌ శంకర్‌తో కలిసి అల్లు అర్జున్‌ మీడియాతో మాట్లాడారు.

అభిమానుల అంచనాలకు మించి దువ్వాడ జగన్నాథం(డీజే) సినిమా ఉంటుందని నిర్మాత దిల్‌రాజ్‌ తెలిపారు. శ్రీవేంకటేశ్వర క్రియేషన్స్‌ బ్యానర్‌పై నిర్మించిన 25వ చిత్రం డీజే అని తెలిపారు. శ్రీవారి ఆశీస్సులు, అభిమానులు, ప్రేక్షకుల ఆదరణతో ఈ సినిమా ఘన విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దర్శకుడు హరీష్‌ శంకర్‌ మాట్లాడుతూ అల్లు అర్జున్‌ నుంచి అభిమానులు కోరుకునే డ్యాన్స్, ఫైట్స్, వినోదం వంటి అన్ని అంశాలతో ఈ సినిమా ప్రతి ఒకరినీ ఆకట్టుకుంటుందని తెలిపారు.

హీరోయిన్‌ పూజా హెగ్డే మాట్లాడుతూ అందరూ మెచ్చేలా ఈ సినిమా ఉంటుందన్నారు. ఈ సినిమాను ఇంటిల్లిపాది చూసి ఆనందించేలా దర్శకుడు హరీష్‌ శంకర్‌ ఎంతో చక్కగా తీర్చిదిద్దారని తెలిపారు. ప్రముఖ డిస్ట్రిబ్యూటర్‌ ఎన్వీ ప్రసాద్‌ మాట్లాడుతూ నిర్మాత దిల్‌రాజుకు శ్రీవారిపై అచంచలమైన భక్తి ఉందని, తను నిర్మించిన ప్రతి సినిమా రిలీజ్‌ చేయడానికి ముందు శ్రీవారిని దర్శించుకుంటారని తెలిపారు. ఈ సినిమాలోని ఓ పాటను బ్రాహ్మణ సంఘం అభ్యంతరం వ్యక్తం చేసిన నేపథ్యంలో లిరిక్స్‌ను మార్చినట్లు ఓ విలేకరి అడిగిన ప్రశ్నకు నిర్మాత దిల్‌రాజు, డైరెక్టర్‌ హరీష్‌ శంకర్‌ తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement