
'పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాలి'
పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు.
మోగా: పంజాబ్ లో రాష్ట్రపతి పాలన విధించాలని మాజీ ముఖ్యమంత్రి అమరీందర్ సింగ్ డిమాండ్ చేశారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు పూర్తిగా క్షీణించాయని ధ్వజమెత్తారు. కదులుతున్న బస్సులో లైంగిక వేధింపులకు పాల్పడి ఆపై తల్లీబిడ్డలను కిందకు తోసివేసిన దారుణ ఘటనలో చనిపోయిన 16 ఏళ్ల బాలిక కుటుంబ సభ్యులను సోమవారం ఆయన పరామర్శించారు.
ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ... రాష్ట్రంలో దారుణ నేరాలు నిత్యకృత్యంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. శిరోమణి అకాలీదళ్, బీజేపీ సంకీర్ణ పభుత్వం అధికారంలో కొనసాగే అర్హత కోల్పోయిందని.. రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని డిమాండ్ చేశారు.