అమెజాన్‌ తాజా షాక్‌ ఎవరికి? | Amazon India Gets RBI Approval To Launch E-Wallet Services | Sakshi
Sakshi News home page

అమెజాన్‌ తాజా షాక్‌ ఎవరికి?

Published Thu, Apr 13 2017 7:47 PM | Last Updated on Tue, Sep 5 2017 8:41 AM

అమెజాన్‌ తాజా షాక్‌  ఎవరికి?

అమెజాన్‌ తాజా షాక్‌ ఎవరికి?

అమెరికాకు చెందిన ఈ-కామ‌ర్స్ దిగ్గజం అమెజాన్  ఇండియా మరో కీలక అడుగు వేసింది. దేశంలో డిజిటల​ లావాదేవీలకు  పెరుగుతున్న  ఆదరణ  నేపథ్యంలో అమెజాన్‌   దూకుడు పెంచింది.   ఫ్లిప్‌ కార్ట్‌ , స్నాప్‌డీల​ తరువాత దేశంలో ఈ వాలెట్‌ సర్వీసులకు శ్రీకారం చుట్టనుంది.  మొబైల్‌  వ్యాలెట్‌ సేవలను అందించేందుకు కేంద్ర బ్యాంక్‌ రిజర్వ్‌ బ్యాంక్‌ ఆఫ్‌ ఇండియా   అనుమతి  సాధించింది.  ఈ నేపథ్యంలో త్వ‌ర‌లోనే ప్రీపెయిడ్‌ పేమెంట్‌ ఇన్‌స్ట్రుమెంట్‌(పీపీఐ)  సేవలను అందించనుంది.తద్వారా ఇప్పటికే ఈ సేవలను అందిస్తున్న పది ప్రధాన సంస్థలకు చెక్‌ పెట్టనుంది.  ఫ్లిప్‌కార్ట్‌కుచెందిన ఫోన్‌  పే, పే టీఎం, మొబీ క్విక్‌,  స్నాప్‌డీల్‌ కు చెందిన ఫ్రీ చార్జ్‌, ఎస్‌బీఐ బడ్డీ,  హెచ్‌డీఎఫ్‌సీకి చెందిన  పే జాప్‌  లాంటి ఇతర మొబైల్‌ సేవల సంస్థ లకు షాకిచ్చింది.

మొబైల్ వ్యాలెట్‌తో భార‌త్ మార్కెట్‌లో త‌మ సేవ‌ల‌ను మ‌రింత విస్త‌రించాల‌ని యోచిస్తున్న అమెజాన్‌ ఆ వైపుగా  అడుగులు వేసేందుకు  సన్నద్ధమవుతోంది.   ముఖ్యంగా ఈ రంగంలో ప్రత్యర్థుల పోటీకి తట్టుకునేందుకు వీలుగా త్వరలోనే  భార‌త్‌లో మొబైల్ వ్యాలెట్ స‌ర్వీసును ప్రారంభనుంది. ఇందుకోసం రిజర్వ్‌ బ్యాంకు ఆఫ్‌ ఇండియా నుంచి లభించిందని అమెజాన్‌ ప్రకటించింది.  దీంతో  ప్రారంభించ‌నున్న‌ట్లు తెలిపింది. వినియోగదారులకు సౌకర్యవంతంగా, నమ్మకంగా నగదు రహిత సేవలను అందించేందుకు తాము దృష్టిసారిస్తామ‌ని  సంస్థ  ప్రతినిధులు తెలిపారు.  దీంతో ఈ స‌ర్వీసును అందిస్తోన్న స్నాప్‌డీల్‌, పేటీఎంలకు వంటి సంస్థ‌ల‌కు అమెజాన్ పోటీ ఇవ్వ‌నుందని మార్కెట్‌ విశ్లేషకులు భావిస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement