ఫోర్ట్ వర్త్: ఆర్లెండో క్లబ్ నరమేథం విషాదం మరువకముందే అమెరికాలోని ఓ స్టూడియోలో కాల్పుల ఘటన కలకలం రేపింది. టెక్సాస్ రాష్ట్రంలోని ఫోర్ట్‌వర్త్ సిటీలోని ‘స్టూడియో 74’ డ్యాన్స్ స్టూడియోలో శుక్రవారం అర్ధరాత్రి కొందరు అనుమతిలేకుండా ప్రవేశించి పార్టీ చేసుకున్నారని.. ఈ సందర్భంగా జరిగిన కాల్పుల్లో ఇద్దరు మరణించారని పోలీసులు తెలిపారు.