ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా | Amitabh Bachchan first choice to replace Aamir Khan for ‘Incredible India’ campaign | Sakshi
Sakshi News home page

ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా

Published Fri, Jan 8 2016 2:37 AM | Last Updated on Thu, Mar 28 2019 8:37 PM

ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా - Sakshi

ప్రభుత్వ నిర్ణయాన్ని గౌరవిస్తా

* బ్రాండ్ అంబాసిడర్‌గా తొలగింపుపై ఆమిర్‌ఖాన్
* ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’గా తెరపైకి అమితాబ్ పేరు

ముంబై: ప్రభుత్వ పర్యాటక ప్రచార కార్యక్రమం ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్ సేవల నుంచి తనను కొన సాగించరాదన్న నిర్ణయాన్ని గౌరవిస్తానని బాలీవుడ్ నటుడు ఆమిర్‌ఖాన్ చెప్పారు. దీనిపై ఆయన గురువారం ముంబైలో విలేకరులతో మాట్లాడారు. ‘‘పదేళ్ల పాటు ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా కొనసాగడాన్ని ఒక గౌరవంగా భావిస్తున్నాను. నా దేశానికి సేవ చేయడంలో సంతోషం ఉంది. సేవ చేసేందుకు నేనెప్పుడూ సిద్ధమే. ఈ సందర్భంగా నేనొక స్పష్టత ఇవ్వదలచుకున్నాను.

ప్రజాప్రయోజనకరమైన చిత్రాలు, ప్రకటనలకు సంబంధించి ఇప్పటివరకు నేను ఎలాంటి డబ్బులూ తీసుకోలేదు. దేశానికి సేవ చేయడాన్ని నేను గౌరవంగా భావిస్తా. నేను బ్రాండ్ అంబాసిడర్‌గా ఉన్నా లేకున్నా భారత్ అద్భుత దేశం..’’ అని ఆమిర్ పేర్కొన్నారు. కాగా ‘ఇన్‌క్రెడిబుల్ ఇండియా’ బ్రాండ్ అంబాసిడర్‌గా బాలీవుడ్ స్టార్ అమితాబ్ బచ్చన్ పేరును ప్రభుత్వం పరిశీలిస్తున్నట్లు పర్యాటక మంత్రిత్వ శాఖ వర్గాలు వెల్లడించాయి.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement